బుర్కా ధరించండని చెప్పి ఇబ్బందుల్లో పడిన ఇమ్రాన్‌ఖాన్
దేశంలో పెరుగుతున్న లైంగిక దాడులను నివారించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. ఇప్పడు మరో కొత్త ఇబ్బందిలో పడ్డారు

ఇస్లామాబాద్ : దేశంలో పెరుగుతున్న లైంగిక దాడులను నివారించడంలో విఫలమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. ఇప్పడు మరో కొత్త ఇబ్బందిలో పడ్డారు. లైంగిక దాడులు జరుగకుండా ఉండాలంటే మహిళలు బుర్కా ధరించడం ఒక్కటే పరిష్కార మార్గమని ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మహిళలకు సలహా ఇచ్చారు.
ప్రధాని సలహా ప్రజల్లో వ్యతిరేక ప్రభావాన్ని చూపించింది. ఆయన గతంలో బికినీ ధరించిన మహిళతో అర్ధనగ్నంగా ఉన్న ఇమ్రాన్‌ఖాన్ ఫొటోను సోషల్ మీడియాలో పంచుకుని ట్రోలింగ్ చేస్తున్నారు. ఇద్దరూ సముద్రంలో స్నానం చేస్తూ ఉన్నట్లుగా ఆ ఫొటోలో కనిపిస్తారు. ఇమ్రాన్‌ఖాన్ గారు మొదట మీరే గిరేబాన్ను వాడండి అంటూ నెటిజెన్లు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ఆదివారం రేడియోలో మహిళలతో నేరుగా ఫోన్లో ఇమ్రాన్‌ఖాన్ మాట్లాడారు. ఈ సమయంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక హింసను అడ్డుకోవడానికి ప్రభుత్వం వద్ద ఏవైనా ప్రణాళికలు ఉన్నాయా? ఒకరు ఇమ్రాన్‌ఖాన్‌ను ప్రశ్నించారు. దానికి ప్రతిస్పందనగా సమాధానమిచ్చిన ఇమ్రాన్‌ఖాన్.. దేశంలో క్షీణిస్తున్న శాంతిభద్రతలను కాపాడేందుకు తీసుకుంటున్న చర్యలకు బదులుగా.. మహిళలు బుర్కా ధరించడం ఒక్కటే దీనికి పరిష్కారం అంటూ సలహా ఇచ్చారు.
దీనిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రధాని పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఇలాంటి చౌకబారు సలహాలు ఇవ్వడమేంటని అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో బికిని ధరించిన మహిళతో సముద్రం ఒడ్డున స్నానం చేస్తున్న ఇమ్రాన్‌ఖాన్ ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇమ్రాన్‌ఖాన్‌కు చురకలంటించారు.
పాకిస్తాన్లో నిత్యం 11 అత్యాచార కేసులు నమోదవుతున్నట్లు అక్కడి గణాంకాలు చెప్తున్నాయి. గత 6 సంవత్సరాలలో 22 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. కేవలం 0.3 శాతం మంది మాత్రమే దోషులుగా నిర్ధారించినట్లు తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
ఆర్మీకి వ్యతిరేకంగా గళమెత్తిన అందగత్తె
2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్‌గా చింతన్ వైష్ణవ్
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kanpur Accident: థార్ వాహనంతో స్కూటర్‌ను ఢీకొట్టిన మహిళ.. కాన్పూర్ ఘటనలో ఒకరు మృతి
Auto | చెట్లు నాటి తిరిగొస్తుండగా.. టిప్పర్‌ను ఢీకొట్టిన కూలీల ఆటో
DADA | డిసెంబర్ 24న దాదా ధమాకా.. నవంబర్ 13న ఫస్ట్ సాంగ్, థమన్ మ్యూజిక్‌తో టాలీవుడ్లో భారీ హైప్!
iQOO | 10,000mAh బ్యాటరీతో iQOO కొత్త ఫోన్.. 7 ఇంచుల భారీ డిస్ప్లే కూడా!
Rajeev Kanakala | ఎన్టీఆర్ అప్పుడే స్టార్ అవుతాడని చెప్పా, 25 ఏళ్లు గడిచినా మారలేదు.. రాజీవ్ కనకాల ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

