e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు

ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు

ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు

భారతదేశ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రపంచవ్యాప్తంగా రాజకీయ విద్యార్థులకు అధ్యయనం చేసే అంశంగా చెప్పుకోవచ్చు. బీజేపీ ప్రారంభించి సరిగ్గా ఇవాల్టికి 41 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నాలుగు దశాబ్దాల కాలంలో లోక్‌సభలో 2 సీట్ల నుంచి 303 సీట్లకు పార్టీ రావడం నిజంగా ఆశ్చర్యపరిచే అంశమే.

అటల్-అద్వానీ ద్వయం నుంచి మోదీ-అమిత్‌షా ద్వయం వరకు పార్టీ ప్రతి దశాబ్దంలో కొత్త విజయాలు సాధించింది. రామ్ జన్మభూమి ఉద్యమం కూడా పార్టీ అభ్యున్నతికి ఎంతగానో సహాయపడింది. అద్వానీ అయోధ్య రథయాత్ర కారణంగానే.. వివాదాస్పద బాబ్రి మసీదును కూల్చివేయడం.. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పునివ్వడం.. అయోధ్యలోని రామ్ జన్మభూమిలో ఆలయం భూమిపూజన్ జరుగడం జరిగిపోయాయి.

1980 ఏప్రిల్ 6 న బీజేపీ స్థాపించబడినప్పటికీ, దాని చరిత్ర భారతీయ జనసంఘ్‌తో ముడిపడి ఉన్నది. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీలపై జరిగిన దారుణాలపై భారతదేశం మౌనంగా ఉండటాన్ని నిరసిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ మంత్రిమండలికి డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ రాజీనామా చేశారు.

ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు

అనంతరం 1951 అక్టోబర్ 21 న భారతీయ జనసంఘ్‌ను స్థాపించారు. 1977 లో ఇందిరా గాంధీ అత్యవసర పరిస్థితిని ముగించి ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించుకున్నప్పుడు, కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమై జయప్రకాష్ నారాయణ్ పిలుపు మేరకు ‘జనతా పార్టీ’ ని ఏర్పాటు చేశాయి. 1977 మే 1 న భారతీయ జనసంఘ్‌.. జనతా పార్టీలో విలీనమైంది. అయితే,

జనతా పార్టీ ప్రయోగం ఎక్కువ కాలం కొనసాగలేదు. పరస్పర పోటీ కూడా పెరుగడం.. ఆర్‌ఎస్‌ఎస్‌కు చెందినవారు పార్టీలో ఉండొద్దని చెప్పడంతో 1980 ఏప్రిల్ 6 న భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అటల్ బిహారీ వాజ్‌పేయి మొదటి అధ్యక్షుడిగా ఉన్నారు.

రథయాత్రతో ముందుకు..

ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు

1984 లోక్‌సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీని హత్య చేసినందున కాంగ్రెస్‌కు అనుకూలంగా సానుభూతి వీయడంతో బీజేపీ కేవలం రెండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. 1989 లో రామ్ జన్మభూమి ఉద్యమానికి పార్టీ మద్దతు ఇవ్వడతో ఎల్‌కే అద్వానీ ఆధ్వర్యంలో సోమనాథ్ నుంచి రామ్ రథ్‌ యాత్రను ప్రారంభించారు. దీని తరువాత పార్టీకి ప్రజల్లో మద్దతు పెరుగుతూనే ఉన్నది.

అప్పటి బిహార్‌ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఆదేశాల మేరకు అద్వానీని అరెస్టు చేశారు. 1993 నాటికి ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్‌, మధ్య ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీజేపీకి ఓట్లు పెరిగాయి. 1995 లో ఆంధ్ర, కర్ణాటక, బిహార్, ఒడిశా, గోవా, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో కూడా కమలం గుర్తింపు పెరిగింది.

కేంద్రంలో అధికారం దాకా..

1996 లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 161 సీట్లు గెలుచుకుని లోక్‌సభలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధాని అయ్యారు. కానీ, మెజారిటీ లేకపోవడంతో ప్రభుత్వం 13 రోజుల్లో పడిపోయింది. 1998 మధ్యంతర ఎన్నికల్లో బీజేపీ మిత్ర పార్టీలతో కలిసి ఎన్డీఏను ఏర్పాటు చేసి అధికారంలోకి వచ్చింది. 1999 లో అన్నాడీఎంకే తమ మద్దతు ఉపసంహరించుకోవడంతో మరోసారి ప్రభుత్వం పడిపోయింది.

1999 అక్టోబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ 303 సీట్లను గెలుచుకుని స్పష్టమైన మెజారిటీని సంపాదించుకున్నది. 183 సీట్లు గెలుచుకుని బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2009 లో 116 సీట్లకు పడిపోయిన బీజేపీని నరేంద్ర మోదీ తన నాయకత్వంలో 2014 లో 282 సీట్లలో గెలిచేలా చేయగలిగారు. 2014 మే 26 న నరేంద్ర మోదీ భారతదేశం 15 వ ప్రధానమంత్రి అయ్యారు. తిరిగి 2019 ఎన్నికల్లో బీజేపీ 303 సీట్లు గెలుచుకుని చరిత్ర సృష్టించింది.

మరికొన్ని ముఖ్య సంఘటనలు :

2010 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతేవాడలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 76 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు మృతి

2009 : ఇటలీలో సంభవించిన భూకంపం కారణంగా 300 మందికి పైగా దుర్మరణం

2000 : ఉగ్రవాదం, హైజాకింగ్ కేసులో పాక్‌‌ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు జీవితఖైదు శిక్ష విధింపు

1966 : పాక్‌ స్ట్రెయిట్‌ మీదుగా ఈది చరిత్ర సృష్టించిన భారత ఈతగాడు మిహిర్ సేన్

1942 : భారతదేశంపై తొలిసారి బాంబులను జారవిడిచిన జపాన్ యుద్ధ విమానాలు

1931 : ప్రముఖ నటి సుచిత్రా సేన్ జననం

1919 : రౌలాట్ చట్టానికి వ్యతిరేకంగా శాసనోల్లంఘన ఉద్యమం కింద దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చిన మహాత్మా గాంధీ

1917 : మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీపై యుద్ధం ప్రకటించిన అమెరికా

1896 : ఏథెన్స్‌లో ప్రారంభమైన మొదటి అంతర్జాతీయ ఒలింపిక్ క్రీడా పోటీలు

ఇవి కూడా చదవండి..

వ్యాక్సిన్‌ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్‌ శరణార్థులు

అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ డైరెక్టర్‌గా చింతన్‌ వైష్ణవ్

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్‌ జంట

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement