Justin Trudeau : కెనడా మాజీ ప్రధాని (Canada Ex PM) జస్టిన్ ట్రూడో (Justin Trudeau), అమెరికన్ పాప్‌స్టార్ కేటీ పెర్రీ (Katy Perry) డేటింగ్లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ ప్రేమ జంట కాలిఫోర్నియా (California) లో జరిగిన ఓ సంగీత ఉత్సవంలో పాల్గొని సందడి చేసింది. డేట్ నైట్‌లో భాగంగా జస్టిన్ బీబర్ సెట్లో ట్రూడోతో కలిసి ఉన్న ఫొటోలు, వీడియోలను కేటీ పెర్రీ సోషల్ మీడియా (Social Media) లో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి.
దాదాపు దశాబ్దంపాటు కెనడా ప్రధానిగా ఉన్న జస్టిన్ ట్రూడో.. గత ఏడాది ప్రారంభంలో తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే గత ఏడాది జూలైలో ట్రూడో-పెర్రీ మాంట్రియాల్‌లోని ఓ రెస్టారెంట్లో తొలిసారి కనిపించారు. దాంతో వాళ్లిద్దరూ డేటింగ్లో ఉన్నారనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత ఓ విలాసవంతమైన నౌకపై వీరు అత్యంత సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తమ రిలేషన్‌షిప్‌పై వీరిద్దరూ ఇప్పటివరకు స్పందించలేదు.
కాగా 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ ట్రూడో తన భార్య సోఫీ గ్రెగొరీకి 2023లో విడాకులిచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇక నటుడు ఓర్లాండో బూమ్‌తో ఏడేళ్లుగా కలిసి ఉన్న కేటీ పెర్రీ గత ఏడాది అతడితో విడిపోయింది.