‘ఒక్కడు’, ‘వర్షం’, ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ వంటి క్లాసిక్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన అగ్ర నిర్మాత, దర్శకుడు ఎమ్.ఎస్. రాజు మళ్లీ మెగాఫోన్ పడుతున్నారు. ఈసారి ఆయన ఎవరూ ఊహించని విధంగా పూర్తిస్థాయి హారర్ థ్రిల్లర్ జోనర్‌తో మన ముందుకు రాబోతున్నాడు. “The Man Who Made You Feel… Now Makes You Fear” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో అనౌన్స్ అయిన ఈ సినిమాకు సంబంధించి రేపు, (ఏప్రిల్ 15)న ఉదయం 10:20 గంటలకు టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేయబోతున్నారు మేకర్స్.
ఇటీవల విడుదలైన ప్రమోషనల్ వీడియోలో ఇద్దరు దొంగలు ఎమ్.ఎస్. రాజు ఆఫీస్‌లోకి ప్రవేశించి ఆయన పాత సినిమాల పోస్టర్లను చూస్తూ ఆనందపడటం, చివరగా కొత్త ప్రాజెక్ట్ పోస్టర్‌ను చూసి గజగజ వణికిపోవడం వంటి దృశ్యాలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రం డార్క్ ఫోర్సెస్ మరియు డెడ్లీ సీక్రెట్స్ నేపథ్యంలో సాగుతూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. టాలీవుడ్ సీనియర్ మేకర్ హారర్ జానర్లో చేస్తున్న ఈ ప్రయోగం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో తెలియాలంటే రేపు ఉదయం 10:20 వరకు వేచి చూడాల్సిందే.
Step into a world filled with Dark Forces & Deadly Secrets ❤️🔥😨@msrajuofficial Next TITLE & FIRST LOOK Tomorrow at 10:20 AM 💥💥
FEAR TAKES OVER 😱#MSRaju @sriadivarahaproductions pic.twitter.com/L8w4U8d4Q7
— Vamsi Kaka (@vamsikaka) April 14, 2026