Uganda army chief demands | అందమైన టర్కీ అమ్మాయి, బిలియన్ డాలర్లు.. ఉగాండా ఆర్మీ చీఫ్ వింత డిమాండ్లు
Uganda army chief demands | ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా, టర్కీకి రెండు డిమాండ్లు చేశారు. సోమాలియాలో సైనిక సేవలకు గాను బిలియన్ డాలర్లు చెల్లించాలని కోరారు. అలాగే టర్కీలోని అందమైన అమ్మాయి తనకు భార్యగా కావాలని డిమాండ్ చేశారు.
కంపాలా: ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా, టర్కీకి రెండు డిమాండ్లు చేశారు. సోమాలియాలోని ఇస్లామిక్ మిలిటెంట్లతో పోరాటానికి ఉగాండా అందించిన దీర్ఘకాలిక సైనిక సేవలకు గాను బిలియన్ డాలర్లు చెల్లించాలని కోరారు. అలాగే టర్కీలోని అందమైన అమ్మాయి తనకు భార్యగా కావాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ల కోసం టర్కీకి నెల రోజులు గడువు ఇచ్చారు. వాటిని నెరవేర్చకపోతే ఉగాండా రాజధాని కంపాలాలోని టర్కీ రాయబార కార్యాలయాన్ని మూసివేయడంతో సహా తీవ్రమైన దౌత్యపరమైన పరిణామాలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.
కాగా, ఉగాండాను టర్కీ వెన్నుపోటు పోడిచిందని ఆ దేశ ఆర్మీ చీఫ్ ముహూజీ కైనెరుగాబా ఆరోపించారు. అలాగే ఇజ్రాయెల్‌కు తన మద్దతును ఆయన ప్రకటించారు. ‘మన దేవుడైన యేసు క్రీస్తు పవిత్ర భూమిని రక్షించడానికి, నా ఆధ్వర్యంలో లక్ష మంది ఉగాండా సైనికులను ఇజ్రాయెల్‌కు పంపడానికి నేను సిద్ధంగా ఉన్నా’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు పలు ట్వీట్లు చేశారు.
మరోవైపు, ఉగాండా ఆర్మీ చీఫ్ జనరల్ ముహూజీ కైనెరుగాబా పెళ్లి కోసం వింత కోరికలు కోరడం ఇదే తొలిసారి కాదు. 2022లో ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనిని వివాహం చేసుకుంటానని ఆయన ప్రతిపాదించారు. బదులుగా ఆ దేశానికి 100 ఆవులను ఆయన ఆఫర్ చేశారు.
Also Read:
Iran vs US | అమెరికా అర్థంలేని డిమాండ్లే చర్చలు విఫలం కావడానికి కారణం : ఇరాన్
Pak Terrorism | ‘గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్-2026’ లో పాకిస్థాన్‌దే అగ్రస్థానం..
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Army Chief
- Bizarre
- bn
- bride
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

