Iran vs US | అమెరికా అర్థంలేని డిమాండ్లే చర్చలు విఫలం కావడానికి కారణం : ఇరాన్
Iran vs US | అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి చర్చలు విఫలం కావడంపై ఇరాన్ (Iran) స్పందించింది. తమ షరతులు అంగీకరించని కారణంగానే చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. అమెరికా చేసిన అర్థంపర్థం లేని డిమాండ్లే చర్చలు విఫలమవడానికి కారణమని ఆరోపించింది.
Iran vs US : అమెరికా-ఇరాన్ (US-Iran) మధ్య శాంతి చర్చలు విఫలం కావడంపై ఇరాన్ (Iran) స్పందించింది. తమ షరతులు అంగీకరించని కారణంగానే చర్చల్లో ఎలాంటి ఒప్పందం కుదరలేదని యూఎస్ ఉపాధ్యక్షుడు (US Vice President) జేడీ వాన్స్ (JD Vance) చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. అమెరికా చేసిన అర్థంపర్థం లేని డిమాండ్లే చర్చలు విఫలమవడానికి కారణమని ఆరోపించింది. యుద్ధం చేసినా తమ నుంచి సాధించలేని డిమాండ్లను వారు శాంతి చర్చల్లో ప్రస్తావించారని విమర్శించింది.
ప్రజల జాతీయ ప్రయోజనాల పరిరక్షణ కోసం తమ ప్రతినిధి బృందం 21 గంటలపాటు చర్చలు జరిపిందని ఇరాన్ అధికారిక మీడియా పేర్కొన్నది. ఒప్పందం చేసుకునేందుకు ఇరాన్ ప్రతినిధులు అన్నిరకాలుగా చొరవ తీసుకున్నట్లు తెలిపింది. కానీ, యూఎస్ అర్థంలేని డిమాండ్లు చర్చల విఫలానికి కారణం అయ్యాయని ఆరోపించింది. యుద్ధంతో సాధించలేని డిమాండ్లను అమెరికా చర్చల్లో ప్రతిపాదించిందని ఘనాలోని ఇరాన్ రాయబార కార్యాలయం పేర్కొన్నది. తాము ఆ డిమాండ్లను గట్టిగా తిరస్కరించినట్లు తెలిపింది.
హర్మూజ్ జలసంధి మూసే ఉంటుందని ఇరాన్ స్పష్టంచేసిందని, దాంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వట్టి చేతులతో వెళ్లిపోయారని ఘనాలోని ఇరాన్ ఎంబసీ వ్యాఖ్యానించింది. పరువు నిలుపుకోవడానికి వారికి మరో మార్గం ఏదీ మిగల్లేదని ఎద్దేవాచేసింది. ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. ఇరుదేశాల మధ్య అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. కానీ రెండు కీలక విషయాలాపై విభేదాలు రావడంతో ఒప్పందం కుదరలేదని చెప్పారు. అయితే ఆ రెండు విషయాలు ఏమిటనేది ఆయన స్పష్టం చేయలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rohan Rane: మైనర్ అమ్మాయిల లైంగిక వేధింపులు.. ఫ్రాన్స్‌లో భారతీయుడికి 20 ఏళ్ల జైలుశిక్ష
Comrade Kalyan | శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’కు మంచి ఓపెనింగ్స్.. తొలిరోజే రూ.4 కోట్లకు పైగా వసూళ్లు!
CJP Protest: సీజేపీ నిరసన వేళ 500 మంది అరెస్టు.. 20 వేల మందితో బందోబస్తు.. మోదీ ఓడారన్న దీప్కే
Jabardasth Babu | మొదట్లో బ్లాక్‌లిస్ట్‌లో పెట్టింది, ఇప్పుడు పెళ్లికి రెడీ అయింది.. జబర్దస్త్ బాబు లవ్ స్టోరీ వైరల్!
Darshan | దర్శన్‌కు మరో ఎదురుదెబ్బ.. సుప్రీంకోర్టులో విజయలక్ష్మి పిటిషన్ తిరస్కరణ
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

