Donald Trump | ఇరాన్‌కు ఆయుధాలిస్తే చాలాపెద్ద సమస్యలొస్తాయ్.. చైనాకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్
Donald Trump | యుద్ధం సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.
Donald Trump : యుద్ధం సమయంలో ఇరాన్‌కు చైనా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు వెలువడిన నివేదికలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు ఆయుధాలు పంపితే చైనా తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాంటి చర్యలను ఇకనైనా మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. చమురు నౌకల ప్రయాణం కోసం హర్మూజ్‌ను తిరిగి తెరవడానికి వీలుగా సీమైన్స్‌ను తొలగించడంలో తమ దళాలు కృషి చేస్తున్నాయని ఆయన వెల్లడించారు. ఇరాన్‌తో చర్చలు విఫలమైనప్పటికీ అంతిమ విజయం తమదేనని పేర్కొన్నారు.
ఇరాన్‌ను తాము సైనికపరంగా ఓడించామని ట్రంప్ అన్నారు. యుద్ధం విషయంలో నాటో వైపు నుంచి అమెరికాకు ఎలాంటి సాయం లభించలేదని చెప్పారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే.. ఇప్పటివరకు జరిగిన దాడుల్లో దెబ్బతిన్న తమ రక్షణ సామర్థ్యాలను వేగంగా పునర్నిర్మించుకోవడానికి ఇరాన్ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో చైనా.. ఇరాన్‌కు భారీగా ఆయుధాలు సరఫరా చేస్తున్నట్లు అమెరికా నిఘా వర్గాలు గుర్తించాయని అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి.
భుజం మీద పెట్టుకొని ప్రయోగించే షార్ట్ రేంజ్ మిసైల్ లాంచర్లను, ఇతర క్షిపణి వ్యవస్థలను టెహ్రాన్‌కు సరఫరా చేయడానికి బీజింగ్ ప్రణాళిక రచిస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. వారం రోజుల్లో అవి టెహ్రాన్‌కు చేరే అవకాశం ఉందని తెలిపాయి. తన పేరు బయటకురాకుండా ఉండేందుకు చైనా ఆయుధాలను ఇతర దేశాల మీదుగా ఇరాన్‌కు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వార్తలను వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఖండించింది. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఏ పక్షానికి ఎలాంటి ఆయుధాలు సరఫరా చేయలేదని పేర్కొన్నది.
అయితే చైనా నుంచి ఆయుధాలు అందినట్లు ఇరాన్ బహిరంగంగా వెల్లడించింది. కానీ, తాము అమెరికా విమానాలను విజయవంతంగా కూల్చడానికి చైనా ఆయుధాలను వాడలేదని, తమ అధునాతన రక్షణ వ్యవస్థలే యూఎస్ విమానాలను కూల్చడానికి ఉపయోగపడ్డాయని ఐఆర్జీసీ వెల్లడించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- china
- Donald Trump
- iran
- Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

