2036 వరకు రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడుగా వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగనున్నారు. ఈ అధికారాన్ని ఇచ్చే చట్టం సోమవారం అమలులోకి వచ్చింది

మాస్కో : రష్యా అధ్యక్షుడుగా వ్లాదిమిర్ పుతిన్ 2036 వరకు కొనసాగనున్నారు. ఈ అధికారాన్ని ఇచ్చే చట్టం సోమవారం అమలులోకి వచ్చింది. దీంతో మరో రెండు పర్యాయాలు అధ్యక్ష పదవిలో కొనసాగడానికి పుతిన్ అనుమతి పొందారు.
68 ఏండ్ల వయసున్న వ్లాదిమిర్ పుతిన్.. రష్యాలో రెండు దశాబ్దాలకు పైగా అధికారంలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ న్యాయ సమాచార పోర్టల్‌లో విడుదల చేసిన సమాచారం ప్రకారం, పుతిన్ ప్రస్తుత పదవీకాలం 2024 లో పూర్తయిన తర్వాత వచ్చే ఎన్నికల్లో ఆయన నిలబడగలుగుతారు.
గత ఏడాది రష్యాలో రాజ్యాంగ సవరణ కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ప్రజాభిప్రాయ సేకరణ 7 రోజుల పాటు కొనసాగించారు. కరోనా సంక్షోభం కారణంగా మొదటిసారి రష్యాలో ఓటు వేయడానికి చాలా సమయం పట్టింది. దాదాపు 60 శాతం ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. 2036 వరకు పుతిన్‌ను పదవిలో ఉంచడానికి రష్యా ప్రజలు మద్దతు తెలుపుతూ ఓటు వేశారు. దీనిలో దాదాపు 76 శాతం మంది ప్రజలు రాజ్యాంగ సవరణకు మద్దతుగా నిలిచారు.
మొదటిసారి అధ్యక్షుడైన పుతిన్
రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ తొలిసారిగా 2000 మే 7 న ఎన్నికయ్యారు. అప్పట్లో ఆయన పదవీకాలం 2008 లో పూర్తయింది. దీని తరువాత మెద్వెదేవ్ అధ్యక్షుడిగా ఎన్నికవగా.. పుతిన్ ప్రధాని అయ్యారు. ఈ సమయంలో అధ్యక్షుడి పదవీకాలాన్ని నాలుగేండ్ల కాలం నుంచి ఆరేండ్లకు పెంచారు. 2012 లో పుతిన్ మరోసారి అధ్యక్షుడవగా.. మెద్వెదేవ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఈ సమయంలో దేశంలో చాలా మార్పులు కనిపించాయి. దీనితో పాటు ఆయన తనను తాను అధ్యక్షుడిగా ఎంతో బలోపేతం చేసుకున్నారు.
2024 లో పుతిన్ పదవీకాలం ముగియనున్నది. రాజ్యాంగ సవరణ చేయకపోతే పుతిన్ మరోసారి పోటీ చేయడానికి అనర్హులయ్యేవారు. దాంతో, అర్హత సాధించేందుకు రష్యా పార్లమెంటు దిగువ సభ అయిన డ్యూమాలో పుతిన్ పదవీకాలాన్ని పొడిగించే ప్రతిపాదన తీసుకొచ్చారు. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ కూడా అయిన ఎంపీ వాలెంటినా తెరేష్కోవా ఈ తీర్మానాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆమె పుతిన్‌కు మద్దతుదారు.
మొన్నటి గూఢచారి.. నేటి ప్రెసిడెంట్
రష్యా ఇంటెలిజెన్స్ ఏజెన్సీ కేజీబీకి గూఢచారిగా 15 సంవత్సరాలు విదేశాల్లో పనిచేశారు. రష్యా మాజీ అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ 1999 లో అకస్మాత్తుగా రాజీనామా చేసినప్పుడు, పుతిన్ దేశ ప్రధానిగా ఉన్నారు. ఆ సమయంలో ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నందున ఆయన కేర్‌టేకర్ అధ్యక్షుడిగా నామినేట్ అయ్యారు. మరుసటి సంవత్సరమే అధ్యక్షుడైన పుతిన్.. అప్పటినుంచి కొనసాగుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఇద్దరు ఎంపీల నుంచి కేంద్రంలో అధికారం దాకా.. బీజేపీ ప్రస్థానం.. చరిత్రలో ఈరోజు
వ్యాక్సిన్ వద్దు.. ఆర్థికంగా ఆదుకోండి: ఆఫ్ఘన్ శరణార్థులు
అటల్ ఇన్నోవేషన్ మిషన్ డైరెక్టర్‌గా చింతన్ వైష్ణవ్
మనుషుల నుంచి పిల్లులు, కుక్కలకు కరోనా: డబ్ల్యూహెచ్‌వో
వర్చువల్‌గా పెండ్లి ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
కారేపల్లిలో నీటి కొరత నివారణకు ముందస్తు చర్యలు
విద్యార్థులకు బాలల హక్కులు, వ్యక్తిగత భద్రతపై అవగాహన
Tragedy |తీర్థయాత్రలో విషాదం.. మనవడిని కాపాడబోయి అమ్మమ్మ, తాత గల్లంతు
Man Offered Bomb As Rasgulla | రసగుల్లా అని చెప్పి బాంబు ఇవ్వడంతో కొరికిన వ్యక్తి.. అది పేలడంతో మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

