Siricilla | సిరిసిల్ల, సిద్దిపేటలో సభలు పెట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తానంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. రేవంత్ సిరిసిల్లకి వచ్చి రాజన్నను దర్శించుకుని పాపప్రాప్తి చేసుకోవాలని తనదైన శైలిలో చురకలించారని తెలిసిందే. ఈ క్రమంలో సిరిసిల్లకు వస్తున్న రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ కూడా రాశారు.
కాగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన నేపథ్యంలో స్థానిక మహిళలు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఓ మహిళ మాట్లాడుతూ.. చీరలు పంచే దగ్గర ఒక మహిళ చనిపోతే కేటీఆర్ కన్న కొడుకు లెక్క వచ్చి ఆమెను స్వయంగా ఎత్తుకొని పోయి దహన సంస్కారాల్లో పాల్గొన్నారు. కేటీఆర్ ఎక్కడ.. రేవంత్ రెడ్డి ఎక్కడ..? కేటీఆర్ మీదికి రేవంత్ రెడ్డి రానే రాడు. కేటీఆర్ మహిళలెవరినైనా కన్నతల్లి లెక్క చూసుకున్నడు. చెబుతున్నా కదా రేవంత్ రెడ్డి వేస్ట్ అని.. అక్కాచెల్లెళ్లు అనుడు తప్పించి మహిళలకు రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ఫైర్ అయింది.
సిరిసిల్లలో ఒక మహిళ చనిపోతే కేటీఆర్ కన్నకొడుకు లాగా ఆమెను ఎత్తుకుని దహనం చేశాడు
మహిళలను కేటీఆర్ తల్లి లాగా చూసుకున్నాడు
– సిరిసిల్ల మహిళ https://t.co/oYbhTq4skS pic.twitter.com/bKEE9pxSx6
— Telugu Scribe (@TeluguScribe) September 28, 2026
UPI Transactions: యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్.. తాత్కాలిక స్టే ఇచ్చేందుకు సుప్రీం నిరాకరణ
KTR | పట్టాలివ్వకపోతే ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ రాళ్లతో కొట్టుమన్నడు.. రైతులతో కేటీఆర్
PYL Secretary | భగత్‌సింగ్ స్ఫూర్తితో యువత ఉద్యమించాలి : పీవైఎస్ కార్యదర్శి