రాయపోల్ : రాయపోల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ ( MPDO Srinivas ) గత ఏడు సంవత్సరాలుగా మండల అభివృద్ధికి ( Development ) చేసిన సేవలు మరువలేనివని సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు రేకుల నర్సింహారెడ్డి ( Narasimha reddy ) అన్నారు.
కొత్తగా ఏర్పడిన మండలంలో పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూ పనిచేశారని కొనియాడారు. మద్దూర్ మండలానికి బదిలీపై వెళ్తున్న శ్రీనివాస్ కు సోమవారం ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని గ్రామాల ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ, సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేశారని పేర్కొన్నారు.
పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తూ సర్పంచులు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమన్వయంతో ముందుకు సాగాలని రేకుల నర్సింహారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్‌ను సర్పంచులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేందర్ రెడ్డి, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.