ఘజియాబాద్ : కొవిడ్-19 రోగులకు సహాయపడేందుకు ఘజియాబాద్ గురుద్వారా ‘ఆక్సిజన్ లాంగర్’ ను ప్రారంభించింది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న కొవిడ్ -19 కేసుల నేపథ్యంలో ఘజియాబాద్ ప్రజలను ఆదుకునేదుకు ఇందిరాపురంలోని గురుద్వార సమితి ప్రాణాలను రక్షించే ఆక్సిజన్ వాయువు కొరత తీర్చేందుకు నడుం బిగించారు. ప్రతి నిత్యం అన్నప్రసాద లాగర్ నిర్వహించడానికి బదులుగా ప్రత్యేకమైన “ఆక్సిజన్ లాంగర్” ను ప్రారంభించారు.
ఈ బృందం ఇంటింటికి తిరుగుతూ సిలిండర్లు అవసరమైన వారు గురుద్వారాకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. గురుద్వారా వద్దకు వచ్చి వారికి కూడా ఆక్సిజన్ అందిస్తున్నారు.ఈ బృందం ఇప్పటివరకు 250 కోవిడ్ -19 రోగులకు సహాయం చేసింది. గత రెండు రోజులుగా పెద్ద సంఖ్యలో రోగులకు ఆక్సిజన్ అందించి వారి ప్రాణాలను నిలుపుతున్నది. వాలంటీర్లు తమ వాహనాల్లో ఆక్సిజన్ ఉపకరణాలను తరలిస్తూ ఉదయం నుంచి బిజీగా ఉన్నారు.
తమ గురుద్వారా వాలంటీర్ల బృందం 25 పెద్ద సిలిండర్లను ఏర్పాటు చేయగలిగిందని, అయితే, ప్రస్తుతం తీవ్రత దృష్ట్యా అవి సరిపోవడం లేదని విచారం వ్యక్తం చేశారు ఇందిరాపురం గురుద్వారా సమితి అధ్యక్షుడు గుర్ప్రీత్ సింగ్. అవసరమైన వారికి సహాయం చేయడానికి తగినంత ఖాళీ సిలిండర్లు అందుబాటు లేకపోవడంతో సరైనరీతిలో అందజేయలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. బ్లాక్ మార్కెట్లో ఆక్సిజన్ అమ్ముకోవాలని కొందరు చూస్తున్నారని, అయితే పకడ్బందీగా ఆక్సిజన్ అందించే ప్రక్రియ చేపట్టినట్లు ఆయన తెలిపారు.
గురుద్వారాకు రాకముందే రోగుల కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ తీసుకునేలా సమితి ఫోన్ నంబర్లను ప్రచారం చేసింది. దాంతో ఆక్సిజన్ సిలండర్లు బ్లాక్‌మార్కెటింగ్ అవడం లేదని పలువురు వాలంటీర్లు చెప్తున్నారు.
#WATCH 'Oxygen Langar' at Sri Guru Singh Sabha Gurdwara in Indirapuram, to help COVID19 patients#Ghaziabad pic.twitter.com/L1yITzUchl
— ANI (@ANI) April 24, 2021
ఆఫ్ఘాన్ ఆర్మీ పోస్టుపై దాడి.. ఐదుగురు తాలిబాన్ ఉగ్రవాదులు హతం
మే నెలలో బాంకులకు 12 సెలవులు.. తగ్గనున్న పని గంటలు
దేశంలోనే ఎత్తైన క్రికెట్ స్టేడియం ఎక్కడంటే..?
విద్యావంతులైన మధ్యతరగతి వారి నిర్లక్ష్యం వల్లే సెకండ్ వేవ్: డాక్టర్ కటోచ్
రంగురంగుల్లో టీవీ ప్రసారాలు.. చరిత్రలో ఈరోజు
భవిష్యత్తులోనూ ఉచిత టీకా కార్యక్రమం: ప్రధాని మోదీ
కరోనాపై గెలిచాం.. పండుగ చేసుకుంటున్న న్యూజిలాండ్
ఒత్తిడికి తలొగ్గిన అమెరికా.. భారత్‌కు అత్యవసర మందులు, వ్యాక్సిన్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..