పుణె: ఇది జీవితంలో మరచిపోలేని సీజన్ అని టీమిండియాపై ప్రశంసలు కురిపించాడు హెడ్ కోచ్ రవిశాస్త్రి. గతేడాది నవంబర్ నుంచి మార్చి 28 వరకు ఇండియన్ టీమ్ రెండు బెస్ట్ టీమ్స్‌తో అన్ని ఫార్మాట్లు కలిపి ఆరు సిరీస్‌లు ఆడి ఐదింట్లో గెలిచింది. ఆస్ట్రేలియా టూర్‌కెళ్లి అక్కడ 4 టెస్టులు, 3 వన్డేలు, 3 టీ20లు ఆడగా.. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో నాలుగు టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లు ఆడింది. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ మినహాయించి అన్ని సిరీస్‌లూ ఇండియన్ టీమ్ గెలవడం విశేషం. ఈ విజయాలను ఉద్దేశించే సీజన్ ఆఫ్ ఎ లైఫ్‌టైమ్ అంటూ రవిశాస్త్రి ట్వీట్ చేశాడు. అద్భుత విజయాలు సాధించిన టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పాడు.
విజయ పరంపర
గతేడాది నవంబర్‌లో టీమిండియా విజయ పరంపర మొదలైంది. ఆస్ట్రేలియాతో ఆడిన తొలి రెండు వన్డేలు ఓడిన కోహ్లి సేన.. మూడో వన్డే గెలిచినా సిరీస్ కోల్పోయింది. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడలేదు. తర్వాత మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో గెలుచుకుంది. ఇక టెస్ట్ సిరీస్‌లో అయితే 32 ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాను ఓడించి 2-1తో చారిత్రక విజయం సాధించింది. అదే ఊపులో సొంతగడ్డపై ఇంగ్లండ్‌ను టెస్ట్ సిరీస్‌లో 3-1తో, టీ20 సిరీస్‌లో 3-2తో, వన్డే సిరీస్‌లో 2-1తో మట్టి కరిపించింది.
చాన్స్ ఇస్తే ఇరగదీశారు
ఇక ఈ సీజన్లో టీమిండియాకు ఆణిముత్యాల్లాంటి ప్లేయర్స్ దొరికారు. తనకు వచ్చిన చాన్స్‌ను ప్రతి ప్లేయర్ ఉపయోగించుకున్నాడు. ఆస్ట్రేలియా టూర్లో వాషింగ్టన్ సుందర్, నవ్‌దీప్ సైనీ, మహ్మద్ సిరాజ్, నటరాజన్ సత్తా చాటారు. ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, కృనాల్ పాండ్యా, అక్షర్ పటేల్, ప్రసిద్ధ్ కృష్ణ వచ్చిన తొలి అవకాశాన్నే సద్వినియోగం చేసుకున్నారు. మొత్తంగా కోచ్ రవిశాస్త్రి చెప్పినట్లు టీమిండియాకు ఇది మరచిపోలేని సీజన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
Congratulations Guys for holding up and having a season of a lifetime in toughest of times across all formats and hemispheres against 2 of the best teams in the world. Take a bow 🇮🇳🙏🏻 #TeamIndia #INDvsENG pic.twitter.com/8UnGPZfMY4
— Ravi Shastri (@RaviShastriOfc) March 28, 2021
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్‌కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ల్యాబ్ నుంచి కాదు.. జంతువుల నుంచే కరోనా: డబ్ల్యూహెచ్‌వో
నందీగ్రామ్‌లో దీదీ ‘వీల్‌చైర్ పాదయాత్ర’
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్