చిన్నారి పెళ్లి కూతురు సీరియల్‌తో ఫుల్ ఫేమస్ పొందిన అవికా గోర్ తెలుగులో ‘ఉయ్యాల జంపాల’, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’ వంటి సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు స్లిమ్‌గా మారి అందరిని ఆశ్చర్యపరిచింది. ఆ మధ్య మిలింద్ చద్వానీతో ప్రేమలో ఉన్నట్టు చెప్పడమే కాక అతని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం మేమిద్దరం ప్రేమలో ఉన్నాం, టైం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాం అని చెప్పుకొచ్చింది.
తాజాగా నటుడు ఆదిల్ ఖాన్ని చర్చిలో వివాహమాడింది అవికా గోర్. ఇది చూసి అందరు షాక్ అయ్యారు. అయితే ఇది రియల్ లైఫ్‌లో కాదు రీల్ లైఫ్ అని తెలుసుకొని శాంతించారు. కాదిల్ అనే ప్రైవేట్ సాంగ్ కోసం నటుడు ఆదిల్, అవికా కలిసి పని చేస్తున్నారు. ఈ సాంగ్‌లోని స్టిల్‌ని అవికా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసి అందరిని కన్ఫ్యూజ్ చేసింది.