ఆ అవార్డులు శార్దూల్, భువనేశ్వర్‌కే ఇవ్వాల్సింది: విరాట్ కోహ్లి
ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

పుణె: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో శార్దూల్ ఠాకూర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, భువనేశ్వర్‌కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కకపోవడంపై కెప్టెన్ విరాట్ కోహ్లి ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా శామ్ కరన్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌గా జానీ బెయిర్‌స్టో నిలిచారు. దీనిపై మ్యాచ్ తర్వాత మాట్లాడిన కోహ్లి.. నేరుగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
నిజాయితీగా చెప్పాలంటే అతడికి (శార్దూల్) మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కకపోవడం ఆశ్చర్యం కలిగించింది. 65 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. 20 బంతుల్లో 30 పరుగులు చేశాడు. ఇక భువీ కూడా మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌కు అర్హుడే. ఆరు పరుగుల లోపు ఎకానమీతో అతడు ఆరు వికెట్లు తీశాడు. రెండు జట్ల మధ్య మిడిల్ ఓవర్లలో, కొత్త బాల్‌తోనూ ఉన్న పెద్ద తేడా వీళ్లిద్దరే. సిరీస్ విజయంలో ఈ ఇద్దరిదే కీలకపాత్ర అని కోహ్లి అన్నాడు.
ప్రతి మ్యాచ్‌లో 300కుపైగా స్కోర్లు నమోదైన వన్డే సిరీస్‌లో భువనేశ్వర్ మాత్రం కేవలం 4.65 ఎకానమీ రేటుతో 6 వికెట్లు తీయడం విశేషం. రెండు జట్లలోనూ ఏ బౌలర్ కూడా అతనికి దరిదాపుల్లో లేడు. అటు శార్దూల్ టీ20, వన్డే సిరీస్‌లలో అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్‌గా నిలిచాడు. టీ20ల్లో 8, వన్డేల్లో 7 వికెట్లు తీశాడు.
ఇవికూడా చదవండి..
సుయెజ్ కాలువలో కదిలిన ఎవర్ గివెన్ షిప్
మయన్మార్ రక్తపాతం.. దారుణం, భయంకరమన్న బైడెన్
ప్రపంచ వాణిజ్యానికి ట్రాఫిక్ జామ్
చిన్నారి పెళ్లికూతురు పెళ్లి పీటలెక్కిందా?
తీరొక్క ఆప్షన్లతో ధరణి పోర్టల్
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

