హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ (CBI) విచారణకు ఇవ్వడాన్ని నిరసరగా శాసన మండలిలో బీఆర్ఎస్ (BRS) సభ్యులు ఆందోళన నిర్వహిస్తున్నారు. చైర్మన్ పోడియాన్ని ముట్టడించిన ఎమ్మెల్సీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. జై తెలంగాణ నినాదాలతో మండలిని హోరెత్తిస్తున్నారు. కాళేశ్వరం నివేదిక ప్రతులను చించి చైర్మన్‌పైకి విసిరి నిరసన వ్యక్తం చేశారు. రాహుల్‌కు సీబీఐ వద్దు, రేవంత్‌కు సీబీఐ ముద్దు, రాష్ట్రాన్ని బాగుచేస్తే సీబీఐ కేసులా.. సిగ్గుసిగ్గు, బడేభాయ్.. చోటేభాయ్ ఏక్ హై.. కాళేశ్వరం రిపోర్ట్ ఫేక్ హై, వియ్ వాంట్ జస్టిస్ అంటూ అంటూ నినాదాలు చేస్తున్నారు.
నిందారోపణ.. రంధ్రాన్వేషణ!.. పొంతన లేని అంశాలతో ఘోష్ రిపోర్టు
ఘోష్ నివేదిక తప్పుల తడక !.. శాసనసభలో కమిషన్ రిపోర్టుపై విరుచుకుపడ్డ బీఆర్ఎస్
కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు.. అసెంబ్లీలో ప్రకటించిన సీఎం
ఇదేం రిపోర్టు.. కమిషన్ చట్టానికి విరుద్ధంగా నివేదిక