నగరవాసులు సోమవారం హోలీ వేడుకలను కులమతాలకు అతీతంగా ఉత్సాహంగా జరుపుకొన్నారు. పెద్దాచిన్నా అనే తేడాలేకుండా ఒకరికొకరు రంగులు పూసుకుంటూ సందడిచేశారు. సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, హైటెక్స్, మణికొండలో హోలీ వేడుకలు అంబరాన్నంటాయి. కొన్ని ప్రాంతాల్లో ముస్లింలు కూడా హోలీ ఆడటంతో పాటు హిందువులకు శుభాకాంక్షలు తెలుపుతూ నగరంలోని గంగా-జమున తెహజీబ్కు సాక్ష్యంగా నిలిచారు.
– సిటీ బ్యూరో, మార్చి 3