సిటీబ్యూరో, మార్చి 3 ( నమస్తే తెలంగాణ) ; నగరంలో బ్లడ్‌మూన్ (చంద్ర గ్రహణం) కనువిందు చేసింది. ఖగోళ పరిశోధకులతో పాటు సామాన్యులు సైతం బ్లడ్‌మూన్‌ను వీక్షించేందుకు బిర్లా ప్లాంటోరియంలో మంగళవారం ఏర్పాట్లు చేశారు. సాయంత్రం 5.27 నిమిషాలకు గ్రహణం కనిపించడం మొదలై 6.47 నిమిషాలకు ముగిసింది. చివరి 25 నిమిషాలు బ్లడ్‌మూన్ స్పష్టంగా కనిపించిందని ఖగోళ పరిశోధకులు తెలిపారు. మరోవైపు నగరవాసులు తమ అపార్ట్మెంట్లపై నుంచి బ్లడ్‌మూన్ వీక్షిస్తూ సోషల్ మీడియాలో ఫొటోలను షేర్ చేస్తూ పోస్టులు చేశారు. కాగా ప్రపంచ వ్యాప్తంగా మధ్యాహ్నం 3.20 గంటలకు ప్రారంభమైన చంద్రగ్రహణం సాయంత్రం 6.47 గంటల వరకు ముగిసింది. ఇది సంపూర్ణ చంద్రగ్రహణం కాదని.. స్వల్ప చంద్ర గ్రహణమేనని ఖగోళశాస్త్రవేత్తలు పేర్కొన్నారు.