హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): ఓటర్లు నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) అందించే గడువు సోమవారంతో ముగియనున్నది. ఆ పత్రాల సమర్పణ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించామని, ఇక పొడిగించే యోచన లేదని ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయ వర్గాలు తేల్చిచెప్పాయి. సీఈవో కార్యాలయ ఆదివారం సాయంత్రం 6 గంటలకు అందించిన నివేదిక ప్రకా రం.. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 78.14 శాతం డిజిటలైజేషన్ పూర్తయింది.
రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లకు గాను వందశాతం ఈఎఫ్లు పంపిణీ చేయగా, ఇప్పటివరకు 2,64, 30,494 పత్రాల (78.14 శాతం) డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. యాదాద్రి-భువనగిరి జిల్లా 94.30 శాతం డిజిటైజేషన్తో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జనగామ (91. 69%), సూర్యాపేట (90. 43%), మెదక్ (90.54%), మహబూబాబాద్ (90.07%) జిల్లాలు తర్వాత స్థానాల్లో ఉన్నాయి. హైదరాబాద్ జిల్లాలో డిజిటలైజేషన్ అత్యంత క నిష్ఠంగా 58.58శాతమే పూర్తయింది.