బీబీనగర్ , ఆగస్టు 9: రూ.54 కోట్ల విలువైన 27 కిలోల మెఫెడ్రోన్‌తోపాటు డ్రగ్ తయారీలో వినియోగించే 40 కిలోల అసిటోన్ లిక్విడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి ఎస్పీ ఆకాంక్ష్ యాదవ్ ఆదివారం మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. శనివారం కొండమడుగు శివారులో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఓ ఫార్చ్యూనర్ కారును తనిఖీ చే యగా 27 కిలోల మెఫెడ్రోన్ బయటపడింది. దీంతోపాటు 40 కిలోల అసిటోన్ లిక్విడ్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విచారణ చేపట్టగా కొండమడుగులోని వేటుకూరి ల్యాబ్స్‌లో డ్రగ్స్ తయారు చేసి నాగ్‌పూర్‌కు తరలిస్తున్నట్టు వెల్లడైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.