పాట్నా : బిహార్‌లో పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పూర్తిస్థాయి లాక్డౌన్ విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించారు. మే 15వ తేదీ వరకు లాక్డౌన్ అమలులో ఉంటుందని పేర్కొన్నారు. కేబినెట్ మంత్రులు, అధికారులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. వివరణ్మాతక మార్గదర్శకాలు, ఇతర కార్యాకలాపాలకు సంబంధించి సంక్షోభ నిర్వహణ బృందాన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
రాష్ట్రంలో కరోనాను నియంత్రించాలని, లాక్డౌన్ ప్రకటించాలని పాట్నా హైకోర్టు సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంతకు ముందు ప్రభుత్వం రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధించింది. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కొనసాగుతున్నది. బిహార్‌లో నిన్న ఒకే రోజు 11,407 కరోనా పాజిటివ్ కేసులు రికార్డవగా.. 82 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటి వరకు మొత్తం కేసులు 5.09లక్షలకు చేరగా.. 2,800 వరకు మృత్యువాతపడ్డారు.
कल सहयोगी मंत्रीगण एवं पदाधिकारियों के साथ चर्चा के बाद बिहार में फिलहाल 15 मई, 2021 तक लाॅकडाउन लागू करने का निर्णय लिया गया। इसके विस्तृत मार्गनिर्देशिका एवं अन्य गतिविधियों के संबंध में आज ही आपदा प्रबंधन समूह (Crisis management Group) को कार्रवाई करने हेतू निदेश दिया गया है।
— Nitish Kumar (@NitishKumar) May 4, 2021