హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు
హైదరాబాద్ జూలో ఎనిమిది సింహాలకు కరోనా లక్షణాలు | నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎనిమిది ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు.

హైదరాబాద్ : నెహ్రూ జూలాజికల్ పార్క్‌లోని ఎనిమిది ఆసియా సింహాల్లో కరోనా లక్షణాలు కనిపించాయి. సింహాల నుంచి అధికారులు నమూనాలను సేకరించి, పరీక్షల కోసం సీసీఎంబీకి పంపారు. మంగళవారం ఎనిమిది సింహాలకు సంబంధించిన కొవిడ్ పరీక్షల నివేదికలు వచ్చే అవకాశం ఉందని జూ అధికారులు పేర్కొన్నారు. పార్క్‌లో పని చేస్తున్న వన్యప్రాణి పశువైద్యులు సఫారిలో ఉంచిన సింహాలలో ఆకలి లేకపోవడం, ముక్కు నుంచి రసి కారడం అలాగే, దగ్గు వంటి కొవిడ్ లక్షణాలను గమనించారు. సఫారీ ప్రాంతం 40 ఎకరాలు ఉండగా.. ఇందులో పది సంవత్సరాల వయసున్న 12 సింహాలు ఉన్నాయి.
వీటిలో నాలుగు ఆడ సింహాలు, నాలుగు మగ సింహాలు మహమ్మారి బారినపడ్డట్లు తెలుస్తోంది. దేశంలో పెరుగుతున్న కరోనా పెరుగుదల నేపథ్యంలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖ, సెంట్రల్ జూ అథారిటీ ఇచ్చిన సూచనల మేరకు ఈ నెల 2న నెహ్రూ జూ ప్కార్‌తో పాటు పలు పార్క్‌లను అధికారులు మూసివేసిన విషయం తెలిసిందే. వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే సింహాలు మహమ్మారి బారినపడడం దేశంలోనే తొలిసారి. గతేడాది ఏప్రిల్‌లో న్యూయార్క్‌లోని ఓ జూలో ఎనిమిది పులులు, సింహాలు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత హాంగాంగ్‌లో కుక్కలు, పిల్లుల్లో వైరస్ లక్షణాలను గుర్తించారు.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్ దంపతులు
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి
తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మూడో విడుతలో 24గంటల్లో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం
దేశంలో రెండు కోట్ల దాటిన కరోనా కేసులు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ENE Repeat | ‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ట్రైలర్ అప్డేట్.. వచ్చేస్తోన్న మ్యాడ్ గ్యాంగ్!
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

