దేశంలో రెండు కోట్లు దాటిన కరోనా కేసులు
దేశంలో రెండు కోట్ల దాటిన కరోనా కేసులు | దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు కోట్ల మార్క్‌ను దాటాయి.

న్యూఢిల్లీ : దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రెండు కోట్ల మార్క్‌ను దాటగా.. వరుసగా మూడో రోజు కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల్లో 3,57,229 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కొత్తగా 3,449 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు విడిచారు. తాజాగా 3,20,289 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,02,82,833కు పెరిగింది. ఇప్పటి వరకు 1,66,13,292 మంది కోలుకున్నారు.
మహమ్మారి బారినపడి మొత్తం 2,22,408 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 34,47,133 యాక్టివ్ కేసులున్నాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు టీకా డ్రైవ్‌లో భాగంగా 15,89,32,921 డోసులు పంపిణీ చేసినట్లు వివరించింది. నిన్న ఒకే రోజు 16,63,742 టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. ఇప్పటి వరకు 29.33 కోట్ల పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇదిలా ఉండగా.. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల్లో అమెరికా తర్వాత భారత్‌లోనే రెండు కోట్ల కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్‌గేట్స్ దంపతులు
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి
తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
మూడో విడుతలో 24గంటల్లో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Magnesium Supplements | మెగ్నిషియం సప్లిమెంట్లలో ఎన్ని రకాలు ఉన్నాయి.. అవి ఎలా పనిచేస్తాయి..?
Holidays | రేపు, ఎల్లుండి పాఠశాలలకు సెలవు
Man, Father Paraded Naked | బాలికతో ప్రేమవ్యవహారం.. యువకుడు, తండ్రి, స్నేహితుడ్ని నగ్నంగా ఊరేగింపు
Cancer Treatment | క్యాన్సర్ చికిత్స తీసుకునే రోగుల్లో గుండె ఆరోగ్యంపై ప్రభావం పడుతుందా..? నిపుణులు ఏం చెబుతున్నారు..?
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

