మూడో విడుతలో 24గంటల్లో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం
మూడో విడుతలో 2.15లక్షల మందికి టీకా : కేంద్రం | దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతోంది. మూడో విడుత పంపిణీ ఈ నెల 1న ప్రారంభం కాగా.. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వ్యక్తులకు టీకా వేస్తున్న విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ కొనసాగుతోంది. మూడో విడుత పంపిణీ ఈ నెల 1న ప్రారంభం కాగా.. 18 నుంచి 44 సంవత్సరాల్లోపు వ్యక్తులకు టీకా వేస్తున్న విషయం తెలిసిందే. 24 గంటల్లో 2,15,185 మంది లబ్ధిదారులకు మొదటి డోసును వేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోనే టీకా డ్రైవ్ జరుగుతోందని, గుజరాత్లో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వయసు ఉన్న 1,08,188 మంది, రాజస్థాన్లో 75,817, మహారాష్ట్రలో 73,455 టీకాలు వేసినట్లు చెప్పింది. హర్యానాలో 54,946, ఛత్తీస్గఢ్లో 1,025, ఢిల్లీలో 39,799, జమ్మూ కాశ్మీర్లో 5,562, కర్ణాటకలో 2,353, ఒడిశాలో 6,311, పంజాబ్లో 635, తమిళనాడులో 2,521, ఉత్తర ప్రదేశ్లో 33,242 మోతాదులు వేసినట్లు చెప్పింది. సోమవారం 8 గంటల వరకు దేశవ్యాప్తంగా 16.5లక్షల వ్యాక్సిన్లు వేయగా.. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 15,88,71,435 డోసులు వేసినట్లు వివరించింది.
ఇవి కూడా చదవండి..
04.05.2021, మంగళవారం మీ రాశిఫలాలు
తెలంగాణలో రాబోయే రెండు రోజులు వర్షాలు
వివాహబంధాన్ని తెంచుకుంటున్న బిల్గేట్స్ దంపతులు
కుటుంబీకులపై కత్తితో యువకుడి దాడి.. తల్లి మృతి
తెలంగాణలో కొత్తగా 6,876 కరోనా కేసులు
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

