Dada Movie | సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ షురూ.. టైటిల్ ఏంటో తెలుసా?
Raj Kumar Rao | ఇండియన్ క్రికెట్ లెజెండ్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది.
Raj Kumar Rao | ఇండియన్ క్రికెట్ లెజెండ్, భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ షూటింగ్ ఎట్టకేలకు ప్రారంభమైంది. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ రాజ్‌కుమార్ రావు ఈ సినిమాలో గంగూలీ పాత్రను పోషించబోతున్నాడు. ఈ చిత్రానికి ‘దాదా’ (Dada: The Sourav Ganguly Story) అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్. రాజ్‌కుమార్ రావు తన ఇన్స్టాగ్రామ్ వేదికగా సినిమా క్లాప్‌బోర్డ్ ఫొటోను షేర్ చేస్తూ.. “అండ్ ఇట్ బిగిన్స్… ది వన్ అండ్ ఓన్లీ దాదా” అంటూ షూటింగ్ ప్రారంభమైన విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు.
ఈ చిత్రానికి విక్రమాదిత్య మోత్వానే దర్శకత్వం వహిస్తుండగా.. లవ్ రంజన్, అంకుర్ గార్గ్ సంయుక్తంగా ‘లవ్ ఫిలిమ్స్’ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ పాత్ర కోసం రాజ్‌కుమార్ రావు కొత్త లుక్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కోసం పెరిగిన బరువును తగ్గించుకుంటూ, దాదా బాడీ లాంగ్వేజ్‌ను అలవర్చుకునే పనిలో ఉన్నాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. తన బయోపిక్కు రాజ్‌కుమార్ రావు సరైన ఎంపిక అని, సినిమా కోసం తాను కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. భారత క్రికెట్‌కు దూకుడు నేర్పిన కెప్టెన్‌గా గంగూలీ ప్రస్థానం, లార్డ్స్ బాల్కనీలో షర్ట్ విప్పిన చారిత్రాత్మక క్షణాల వంటి ఎన్నో ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

