Bellampalli Municipality | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీలో పలువురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర కౌన్సిలర్ శంకర్ సింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు.
కేటీఆర్ వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితోపాటు బీజేపీకి చెందిన 34వ వార్డు కౌన్సిలర్ రామూర్తి కేటీఆర్‌ను కలిసి మద్దతు తెలిపారు. బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ రావడంతో తాజా చేరికలతో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరినట్టైంది.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో మొత్తం 34 స్థానాలుండగా.. బీఆర్ఎస్కు 14, కాంగ్రెస్‌కు 14,ఇండిపెండెంట్లు 5, బీజీపీ 1 స్థానం దక్కాయి. తాజా చేరికలతో బీఆర్ఎస్ బలం 17కు చేరింది. ఈ చేరికలతో బెల్లంపల్లి మున్సిపాలిటీ పీఠంపై బీఆర్ఎస్ జెండా ఎగరవేసే దిశగా ముందుకెళ్తున్నారు.
బెల్లంపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన పలువురు కౌన్సిలర్లు
బెల్లంపల్లి మున్సిపాలిటీలో హంగ్ రావడంతో, ఈ చేరికలతో బీఆర్ఎస్ పార్టీ మరింత బలం
కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరిన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన 26వ వార్డు కౌన్సిలర్ కుమారస్వామి, 30వ వార్డు స్వతంత్ర… pic.twitter.com/Ffo85agBOI
— Telugu Scribe (@TeluguScribe) February 14, 2026
Mallela Rajasri | బీఆర్ఎస్లో ఛైర్మన్ పదవి అనుభవించి కాంగ్రెస్‌లోకి జంప్.. బుద్ధిచెప్పిన ఓటర్లు
Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్