– కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం
చౌటుప్పల్, ఫిబ్రవరి 14 : కుమ్మర్లు రాజకీయంతో పాటు అన్ని రంగాల్లో ఎదగాలని కుమ్మరి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏడుకొండల వెంకటేశం అన్నారు. శనివారం చౌటుప్పల్ మున్సిపాలిటీ రెండో వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గెలుపొందిన పోలేపల్లి లక్ష్మీ ముత్తయ్యను ఆయన ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజకీయంతో పాటు వివిధ రంగాల్లో రాణించి, వృత్తి విద్యలో నైపుణ్యాన్ని చూపిస్తూ మట్టి పాత్రలు వాడే విధంగా కృషి చేయాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడే విధంగా అన్ని రకాల కుమ్మరి మట్టి పాత్రలను వాడాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి ఒక శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి వృత్తి శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా కుమ్మర సంఘం అధ్యక్షుడు ఓరుగంటి గోపాల్, ప్రధాన కార్యదర్శి దరుపల్లి ప్రవీణ్, చిన్న కొండూరు సర్పంచ్ తీగుళ్ల చంద్రయ్య, చౌటుప్పల్ మండల కుమ్మరి సంఘం అధ్యక్షుడు సిలివేరు శ్రీనివాస్, అసోసియేట్ అధ్యక్షుడు సిలివేరు నరేష్, ప్రధాన కార్యదర్శి పోలేపల్లి ముత్తయ్య, గౌరవ అధ్యక్షుడు చిలువేరు జంగయ్య, యూత్ అధ్యక్షుడు పోలేపల్లి నవీన్, వెంకటేష్, తిగుళ్ల నరసింహ, చిలువేరు మంగయ్య, సత్తయ్య, ఊషయ్య, ధనరాజ్ పాల్గొన్నారు.