– రెండు తూముల వద్ద 600 ఇసుక బస్తాల ఏర్పాటు
దుమ్ముగూడెం, జూలై 30 : దుమ్ముగూడెం మండల కేంద్రంలోకి గోదావరి నీరు ప్రవేశించకుండా కరకట్టకు ఉన్న మూడు తూముల్లో రెండు తూముల వద్ద 600 ఇసుక బస్తాలను ఏర్పాట చేసి తూములను ఇరిగేషన్ శాఖ అధికారులు మూసివేశారు. దీంతో గ్రామంలోకి గోదావరి నీరు ప్రవేశించదు. వర్షాకాలం మొదలు కావడంతో గోదావరి వరదలు ఉదృతమైతే ఊర్లోకి నీరు చేరకుండా ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ శాఖ ఏఈ సూర్యం, పీటీ మస్తాన్ వలీ, వర్క్ ఇన్సెపెక్టర్లు పాల్గొన్నారు.