e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, June 13, 2021
Home News క‌రోనా సాయానికి ప్ర‌తిఫలంగా రాజకీయ మ‌ద్ద‌తు కోర‌ట్లేదు :ఆంథోనీ బ్లింకెన్

క‌రోనా సాయానికి ప్ర‌తిఫలంగా రాజకీయ మ‌ద్ద‌తు కోర‌ట్లేదు :ఆంథోనీ బ్లింకెన్

క‌రోనా సాయానికి ప్ర‌తిఫలంగా రాజకీయ మ‌ద్ద‌తు కోర‌ట్లేదు :ఆంథోనీ బ్లింకెన్

వాషింగ్టన్: కరోనా వైర‌స్ సెకండ్ వేవ్‌తో పోరాడుతున్న భారతదేశానికి సహాయం చేయడానికి అమెరికా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. భారతదేశానికి సహాయం చేసేందుకు అవసరమైన ప్రాంతాల్లో యూఎస్‌ పరిపాలన వివిధ శాఖలను గుర్తించింది. ఇది కాకుండా, పరిపాలనాపరమైన అడ్డంకులు కూడా తొలగిస్తున్నారు. ఇదే స‌మ‌యంలో భార‌త్‌కు క‌రోనా సాయానికి ప్ర‌తిఫ‌లంగా వారి నుంచి రాజ‌కీయ మ‌ద్ద‌తును కోరుకోవ‌డం లేద‌ని అమెరికా కుండ‌బ‌ద్ద‌లు కొట్టింది. ఒక‌వైపు సాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్న‌ట్లు చెప్తూనే మ‌రోవైపు వారి నుంచి రాజ‌కీయ మ‌ద్ద‌తు కోరుకోవ‌డం లేద‌ని వెల్ల‌డించ‌డంలో ఆంత‌ర్యం ఏమిటో వారికే తెలియాల‌ని రాజ‌కీయ నిపుణులు అంటున్నారు.

భారతదేశంతో మాకు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం ఉన్న‌దని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ చెప్పారు. విదేశాంగ మంత్రి ఆంథోనీ బ్లింకెన్ కూడా మేం భారతదేశానికి ఎలాంటి రాజకీయ మద్దతు కోసం సహాయం చేయడం లేదని స్పష్టం చేశారు. అమెరికాలోని నిరుపేదలు, మానవతకు ఇది మా నిబద్ధత అని పేర్కొన్నారు.

ఆంథోని బ్లింకెన్ మాట‌లు వారికి రాజ‌కీయ మ‌ద్ద‌తు అవ‌స‌రాన్ని తేల్చిచెప్తున్నాయ‌ని ప‌లువురు అంత‌ర్జాతీయ రాజ‌కీయ నిపుణులు అంటున్నారు. విప‌త్తు వేళ సాయం చేయ‌డం గురించి ఆలోచించే వారికి మ‌రో విష‌యం క‌ళ్ల ముందు క‌నిపించ‌ద‌ని, అయితే, అమెరికా ఇలా మాట్లాడ‌టం మొత్తానికి వారు కోరుకుంటున్న‌ది అదే అని చెప్ప‌క‌నే చెప్తున్న‌ట్లుగా తోస్తున్న‌ద‌ని వారు భావిస్తున్నారు.

40 కంపెనీలు ముందుకు..

భారతదేశానికి సంఘీభావం తెలిపేందుకు 40 అగ్ర అమెరికా కంపెనీలు ముందుకు వచ్చాయి. దీని కింద భారతదేశానికి సహాయం చేయడానికి వనరులను సమీకరించడానికి గ్లోబల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశారు. అమెరికాలోని వివిధ వాణిజ్య సంస్థలు సంయుక్తంగా 20,000 ఆక్సిజన్ కాన్సంట్రేట‌ర్ల‌ను కొన్ని వారాల్లో భారత్‌కు పంపుతాయని డేలైట్ సీఈఓ పునీత్ రంజన్ తెలిపారు. ఇవే కాకుండా మందులు, టీకాలు, ఆక్సిజన్, ఇతర ప్రాణాలను రక్షించే పరికరాలను కూడా పంపుతామ‌ని ఆయ‌న చెప్పారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

పోలీసుల డాటా చోరీ, ఆపై బ్లాక్ మెయిలింగ్‌..

అమెరికా జ‌నాభా 33 మిలియ‌న్లు.. 2020 సెన్సెస్ డాటా విడుద‌ల‌

న‌టుడు మిథున్ చక్రవర్తికి క‌రోనా పాజిటివ్

పాకిస్తాన్‌కు స‌మ‌స్య‌గా మార‌నున్న అల్ ఖైదా వంటి సంస్థ‌లు.. అమెరికన్ జ‌న‌ర‌ల్ హెచ్చ‌రిక‌

వివాదాస్పద ద్వీపాల వ‌ద్ద‌ ఫిలిప్పీన్స్ సైనిక విన్యాసాలు

స్పుత్నిక్ వీ పై బ్రెజిల్ సందేహాలు.. వాడకం నిలిపివేత‌

అనుమానాస్పద సంస్థకు పెంటగాన్ నుంచి 17.5 కోట్ల ఇంటర్నెట్ అడ్ర‌స్‌లు

ఇత‌ను ఆఫ్రికా రామ్‌దేవ్ బాబా..! వీడియో వైర‌ల్‌

యాంటీ-క్యాన్సర్ ఔషధమైన విన్కోవ్ -19 కు డీసీజీఐ ఆమోదం

స‌బ్బండ వర్గాలకు గొడుగులా మారిన గులాబీ పార్టీ.. చ‌రిత్ర‌లో ఈరోజు

ఇలాంటి వారు వైరస్ బారిన పడే అవకాశాలు తక్కువ : సీఎస్ఐఆర్ సెరో స‌ర్వేలో వెల్ల‌డి

మే నెల‌లో బాంకుల‌కు 12 సెల‌వులు.. త‌గ్గ‌నున్న ప‌ని గంట‌లు

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
క‌రోనా సాయానికి ప్ర‌తిఫలంగా రాజకీయ మ‌ద్ద‌తు కోర‌ట్లేదు :ఆంథోనీ బ్లింకెన్

ట్రెండింగ్‌

Advertisement