Mother Dairy | వస్తు సేవల పన్ను (GST) రేట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. జీఎస్టీలోని అత్యధిక పన్ను శ్లాబులను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. జీఎస్టీలో ప్రస్తుతం 5, 12, 18, 28 శాతం పన్ను స్లాబులున్న విషయం తెలిసిందే. మార్కెట్లోని దాదాపు అన్ని వస్తూత్పత్తులపై ఈ స్లాబుల ప్రకారమే పరోక్ష పన్నులు పడుతున్నాయి. అయితే, వీటిలో 12, 28 స్లాబులను కేంద్రం తొలగించింది. ఇకపై 5, 18 శాతం స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఈ కొత్త పన్ను రేట్లు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. కేంద్రం నిర్ణయంతో అనేక వస్తువుల రేట్లు తగ్గనున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ డెయిరీ సంస్థ మదర్ డెయిరీ (Mother Dairy) తాజాగా కీలక ప్రకటన చేసింది. పాల (milk) నుంచి నెయ్యి వరకూ అనేక ఉత్పత్తులపై జీఎస్టీ మార్పులకు అనుగుణంగా రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించింది.
వెన్న, నెయ్యి, మిల్క్ ప్రొడక్ట్స్, మజ్జిగ వంటివి 12 శాతం శ్లాబులో ఉండగా.. దీన్ని తొలగించడంతో ఇవి 5 శాతం శ్లాబులోకి చేరనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు అనుగుణంగా మదర్ డెయిరీ ప్రకటన చేసింది. పాలు, పన్నీర్, బటర్, చీజ్, నెయ్యి, మిల్క్ షేక్స్ వంటి ఉత్పత్తుల రేట్లను తగ్గించి జీఎస్టీ బెనిఫిట్స్ ప్రజలకు అందించనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రొడక్ట్, ప్యాకేజింగ్‌ను బట్టి రూ.2 నుంచి గరిష్ఠంగా రూ.30 వరకు రేట్లు తగ్గనున్నాయని తెలిపింది.
సంస్థ నిర్ణయంతో యూహెచ్‌టీ టోన్డ్ ఉత్పత్తుల ధర రూ.77 నుంచి రూ.75కి తగ్గనుంది. ఇదే సమయంలో 450 ఎంఎల్ డబుల్ టోన్డ్ యూహెచ్‌టీ పాల రేటు రూ.33 నుంచి రూ. 32కి, మిల్క్‌షేక్స్ (స్ట్రాబెర్రీ, చాకొలేట్, మ్యాంగో, రబ్రీ ఫ్లేవర్స్) 180 మిల్లీలీటర్ ప్యాక్ ధర రూ. 30 నుంచి రూ.28కి, 200 గ్రాముల పన్నీర్ రేటు రూ.95 నుంచి రూ.92కి, అదే 400 గ్రాముల ప్యాక్ రేటు రూ.6 వరకూ తగ్గనుంది. ఇక మలాయ్ పన్నీర్ 200 గ్రాముల ప్యాక్ రూ. 100 నుంచి రూ.97కు దిగొచ్చింది. ఇదే సమయంలో 500 గ్రాముల బటర్ ప్యాకెట్ రేటు రూ.305 నుంచి రూ.285కి తగ్గించింది. 100 గ్రాముల ప్యాక్ ధర రూ. 62 నుంచి రూ. 58 కి దిగొచ్చింది. చీజ్ క్యూబ్స్ 180 గ్రాములపై రూ. 10 తగ్గి రూ. 135కు చేరింది. చీజ్ స్లైసెస్ 480 గ్రాముల ధర రూ. 405 నుంచి రూ. 380కి తగ్గింది. చీజ్ బ్లాక్ (200 గ్రాములు) రూ. 150 నుంచి రూ. 140కి, చీజ్ స్ప్రెడ్ (180 గ్రాములు) రూ. 120 నుంచి రూ. 110కి తగ్గించింది. సవరించిన ధరలు ఈనెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి.
– 22 सितंबर से दूध, घी, मक्खन सस्ता होने जा रहा है
– मदर डेयरी ग्राहक को पहुंचाएगा जीएसटी का पूरा फायदा#GSTReforms #PriceRevision #MotherDairy@ZeeBusiness @MotherDairyMilk pic.twitter.com/hVVAHmrFwe— Ambarish Pandey (@pandeyambarish) September 16, 2025
Also Read..
Dehradun | వరద ఉద్ధృతికి నదిలో కొట్టుకుపోయిన ట్రాక్టర్.. పది మంది గల్లంతు.. షాకింగ్ వీడియో
Loot Liquor | గుంటలో ఇరుక్కుపోయిన మద్యం సీసాలతో నిండిన స్కార్పియో.. ఎగబడ్డ స్థానికులు
Tapkeshwar Mahadev Temple: తపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి నీళ్లు.. 12 ఫీట్ల ఎత్తుకు వరద నీరు