Dehradun | ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని డెహ్రాడూన్ (Dehradun)లో క్లౌడ్ బరస్ట్ (Clouburst) సంభవించిన విషయం తెలిసిందే. సోమవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న ఓ నదిలో పది మంది కూలీలు కొట్టుకుపోయారు.
భారీ వర్షాలకు డెహ్రాడూన్లోని టాన్స్ నది (Tons river) ఉప్పొంగి ప్రవహిస్తోంది. అదే సమయంలో అటుగా వస్తున్న ఓ ట్రాక్టర్ నదిలో చిక్కుకుపోయింది. వరద ప్రవాహం పెరగడంతో కొట్టుకుపోయింది. అందులోని పది మంది కూలీలు కూడా గల్లంతయ్యారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతోంది. అయితే, వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనలో పది మంది కూలీలు ప్రాణాలు కోల్పోయి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు.
Flooding occurred on the Tons River in Dehradun.
Stay away from that area. pic.twitter.com/G9S2fQnr7o— Ansh (@anshhxxxx) September 16, 2025
Also Read..
Flash floods | ఉత్తరాఖండ్లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. వరదల్లో పలువురు గల్లంతు
Loot Liquor | గుంటలో ఇరుక్కుపోయిన మద్యం సీసాలతో నిండిన స్కార్పియో.. ఎగబడ్డ స్థానికులు
Tapkeshwar Mahadev Temple: తపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి నీళ్లు.. 12 ఫీట్ల ఎత్తుకు వరద నీరు