డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో గత రాత్రి భీకర వర్షం కురిసింది. దీంతో డెహ్రాడూన్లో భారీ నష్టం వాటిల్లింది. వరదల వల్ల ముఖ్యమైన ప్రదేశాల్లో ఆనవాళ్లు మారిపోతున్నాయి. నగరంలోని ఫన్ వ్యాలీ, ఉత్తరాఖండ్ డెంటల్ క ఆలేజీ వద్ద ఉన్న బ్రిడ్జ్ కొట్టుకుపోయింది. డెహ్రాడూన్-హరిద్వార్ జాతీయ రహదారి పూర్తిగా ధ్వంసమైంది. సహస్త్రధారలో అనేక షాపులు, హోటళ్లు మునిగిపోయాయి. టూరిస్టు స్పాట్లు వరద నీటితో నిండిపోయాయి.
తామస నదిలో నీటి ప్రవాహం ఉదృతంగా ఉన్నది. దీంతో తపకేశ్వర్ మహాదేవ్ ఆలయం(Tapkeshwar Mahadev Temple) ఆ నీటిలో మునిగింది. డెహ్రాడూన్లో ఫేమస్ ఆలయంగా తపకేశ్వర్ టెంపుల్కు గుర్తింపు ఉన్నది. నీళ్లు ఆలయ పరిసరాల్లోకి ప్రవేశించాయి. గుడిలో ఉన్న హనుమాన్ విగ్రహం సగం వరకు మునిగిపోయింది. సుమారు 12 ఫీట్ల ఎత్తుతో నీరు ప్రవాహిస్తోంది. అయితే ఆలయ గర్భగుడికి మాత్రం ఎటువంటి నష్టం జరగలేదు.
గుహలో ఉన్న ఈ గుడిలోకి రాత్రిరాత్రే నీళ్లు ప్రవేశించాయి. తెల్లవారుజామున 4.45 నిమిషాలకు అకస్మాత్తుగా గుహలోకి ప్రవేశించినట్లు స్థానికులు చెప్పారు. ఆ తర్వాత క్షణాల్లోనే నీరు 12 ఫీట్ల ఎత్తుకు చేరుకున్నది. దీంతో అక్కడ ఉన్న శివలింగం నీట మునిగింది. గుహలో చిక్కుకున్న కొందరు తాడు సహాయంతో ఆ గుహ నుంచి బయటకు వచ్చారు.
#WATCH | Uttarakhand: Due to heavy rains in Dehradun since last night, the river Sahastradhara got flooded late at night, and debris came into the main market, causing damage to hotels and shops. pic.twitter.com/f7p0tSg7Ip
— ANI (@ANI) September 16, 2025