వ్యాపారంలో నష్టాలు..కుటుంబం ఆత్మహత్య
అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొన్నది.
- అంబర్‌పేటలో ఘోర విషాదం
- భార్యా భర్తలతోపాటు కుమారుడు బలవన్మరణం
గోల్నాక, ఫిబ్రవరి 24 : అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఘోర విషాదం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలవన్మరణానికి పాల్పడటంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొన్నది. సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితాకృష్ణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. బాపునగర్ కాకతీయ బజార్‌కు చెందిన రామ్రాజ్(55), ఆయన భార్య మాధవి(52), కుమారుడు శశాంక్(24) మంగళవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడ్డారు. ముందుగా మాధవి ఆత్మహత్యకు పాల్పడగా, అదే గదిలో భర్త రామ్రాజ్ ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆ తర్వాత కుమారుడు శశాంక్.. చేతి మణికట్టును కత్తితో కట్ చేసుకోవడంతో తీవ్ర రక్తస్రావం కాగా, అది కుదరకపోవడంతో ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్ ఆధారంగా ఆర్థికభారంతో ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. రామ్రాజ్ మూడేండ్లుగా రామంతాపూర్‌లో హోటల్ నిర్వహిస్తున్నాడు. పార్ట్‌నర్స్‌తో విభేదాల కారణంగా కొద్దికాలం క్రితం తన వాటాతో పక్కకు తప్పుకొన్నాడు. అనంతరం నగరంలోని చక్రిపురంలో మరో హోటల్ నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో నష్టాలతో రామ్రాజ్ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

