హైదరాబాద్, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ): ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడమే మిషన్ భగీరథ లక్ష్యమని మంత్రి సీతక అన్నారు. వేసవికాలం దృష్ట్యా ప్రత్యేక డ్రైవ్ లు చేపట్టాలని, సర్పంచ్ల ఫోన్‌కాల్స్‌కు స్పందించి సమస్యలు పరిషరించాలని సూచించారు. ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా, వేసవి సన్నద్ధతపై మంగళవారం ఆమె ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 వేల ఆవాసాల్లో 150 ఆవాసాలకు మాత్ర మే మిషన్ భగీరథ నీరు అందడం లేదని, కొత్తగా 397 ఆవాసాలు ఏర్పాటయ్యాయ ని అధికారులు తెలిపారు. మిషన్ భగీరథ సోర్స్ పాయింట్లు, రిజర్వాయర్లలో నీటి లభ్యత, పంపింగ్ వ్యవస్థ, గ్రామాలవారీగా సరఫరా పరిస్థితులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం సీతక్క మాట్లాడుతూ.. కొండ లు, అటవీ ప్రాంతాల్లో పైప్లైన్లు వేయడం కష్టంగా ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ప్రతి ఎస్ఈ పరిధిలో ఇంటింటికీ తాగునీరు అందుతున్న పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకుని, లోపా లు సరిదిద్దాలని సూచించారు. సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు.