వరంగల్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ భవన్.. 2006 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమ నిషాన్. 2014 జూన్ నుంచి భవిష్యత్తు తరాలకు తెలంగాణ షాన్. తెలంగాణ కళావారసత్వ ప్ర తీక. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ జీవధార. తెలంగాణ నిలువెత్తు ధిక్కార సంతకం. ఉమ్మ డి రాష్ట్ర పాలకుల పద్మవ్యూహాలను తిప్పికొట్టిన ప్రతివ్యూహ రచనా కేంద్రం. అప్పటిదాకా ఉన్న రాజకీయ పార్టీల కార్యాలయాలకు దేశ రాజధానిలో అయితే ఆ పార్టీల పేరుతో.. రాష్ట్ర రాజధాని కేంద్రంలో అయితే ఆయా పార్టీ ల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో పనిచేసిన దివంగత నేతల పేర్లు పెట్టుకోవడం ఆనవాయితీ. తెలంగాణ ఉద్యమ నేత, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆ ఆనవాయితీని బద్దలుకొట్టారు. బీఆర్ఎస్ కార్యాలయాన్ని తెలంగాణ ప్రజల అస్తిత్వ ఆత్మ ప్రతిఫలించే కేంద్రం గా భాసిల్లాలని సంకల్పించారు. అందుకే దీని కి తెలంగాణ భవన్ అని పేరుపెట్టారు. ఆ పేరు వెనుక బలమైన నేపథ్యం ఉన్నది. భవిష్యత్తు తాత్వికతా ఉన్నది.
ఏ తెలంగాణ గడ్డపై ఉన్న ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో(1996 బడ్జెట్ సెషన్లో దాస్యం ప్రణయ్‌భాస్కర్ ‘తెలంగాణ’ వెనుకబాటుతనంపై ప్రస్తావిస్తే నాటి పాలకుడు చంద్రబాబు తెలంగాణ పదాన్ని నిషేధించిన నేపథ్యంలో) తెలంగాణ పదాన్ని నిషేధించారో అ పదమే ఉమ్మడి పాలకుల గుండె ల్లో అసలైన ఆయుధం కావాలని కేసీఆర్ సంకల్పించారు. తరతరాలు నా తెలంగాణ ప్రజలు సగర్వంగా తలెత్తుకొని బతుకాలని సంకల్పించారు. ‘నిషేధం విధించిన చోటే నిప్పురవ్వను పూయిస్తా’ అనే సంకేతాత్మకంగా తెలంగాణ భవన్‌ను తీర్చిదిద్దారు. 2004లో భవన్‌కు భూమిపూజ చేసినప్పటి నుంచి 2006లో పూర్తయ్యేదాకా కేసీఆర్ ఉ ద్యమ కార్యవ్యూహ కేంద్రంగా.. తెలంగాణ అ నంతరం ప్రగతిపూల వనం గా తెలంగాణ భవన్ రూ పాంతరం చెందుతూ వ చ్చింది. ఇవ్వాళ అదే తెలంగా ణ భవన్ కాంగ్రెస్ సర్కార్‌ను ముచ్చెమటలు పెట్టించే జనతా గ్యారేజీగా ప్రజలకు అండగా మారింది. తెలంగాణ భవన్ ప్రారంభోత్సవమై (ఆగస్టు 14, 2006) రెండు దశాబ్దా లు పూర్తయిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
జలదృశ్యాన్ని బలవంతంగా ఖాళీ చేయిస్తే.. జనసంద్రమై ఎగసిన కెరటం
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ సారథ్యంలో 2001 ఏప్రిల్ 27న హైదరాబాద్‌లోని జలదృశ్యంలో (కొండా లక్ష్మణ్ బాపూ జీ ఇల్లు) గులాబీ జెండా ఎగిరింది. అనతికాలంలోనే కరీంనగర్, నిజామాబాద్ జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా గెలిచి నిలిచింది. దా దాపు 100కు చేరువలో జడ్పీటీసీలు, వేలాది మంది ఎంపీటీసీలు, సర్పంచులు బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఈ పరిస్థితి చూస్తుంటే గులాబీ జెండా భారీ ఉపద్రవాన్ని సృష్టించేలా ఉన్నదని గ్రహించిన నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు నిద్ర కరువైంది. గెలిచిన బీఆర్ఎస్ స్థానిక ప్రజాప్రతినిధులకు కేసీఆర్ నిజామాబాద్‌లో శిక్షణ కార్యక్రమంలో ఉండగా, ఇదే సమయం అని భావించి జలదృశ్యంలోని పార్టీ కార్యాలయంలోని వస్తువులను, వద్దని వారించిన మనుషులను చంద్ర‘దండు’ (పోలీసులతోపాటు టీడీపీ కార్యకర్తలకు నాడు కేసీఆర్ పెట్టిన పేరు) ఈడ్చి అవతలపారేసింది. దీంతో కేసీఆర్ ఇల్లే (నందినగర్) పార్టీ కార్యాలయమైంది. రోజురోజుకూ ఉద్యమ తీవ్రత పెరుగుతుండటంతో, తెలంగాణ నలుమూలల నుంచి ఉద్యమకారుల తాకిడి పెరిగింది. కేసీఆర్ ఇంటి వద్ద పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తూనే బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వేదాంతరావు ఇంటిలోనూ కొనసాగాయి. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో బీఆర్ఎస్తో కాంగ్రె స్ పొత్తుపెట్టుకోవడం, తెలంగాణ కోసం కేం ద్రంలో, రాష్ట్రంలో అధికార భాగస్వామ్యాన్ని పంచుకోవడం, చట్టబద్ధంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించారు. 2004 డిసెంబర్ 11న భూమిపూజ జరుగగా, 2006 ఆగస్టు 14న ప్రజల సమున్నత సౌరభంగా తెలంగాణ భవన్ ప్రారంభమైంది.
తెలంగాణ తల్లి విగ్రహావిష్క‘రణం’

ఉద్యమం కోసం ప్రజాచైతన్యాన్ని కూడగట్టేందుకు కేసీఆర్ సాంస్కృతిక, కళా, వారసత్వ రంగాల్లో నిష్ణాతులతో చర్చోప చర్చలు జరిపి తెలంగాణ తల్లికి రూపాన్ని ఇచ్చారు. అ ప్పటిదాకా ఉన్న తెలుగుతల్లిని తెలంగాణకు స వతి తల్లేనని నిరూపించారు. శత్రువు ఎంతటి బలవంతుడైనా అనేక సందర్భాల్లో కేసీఆర్ వ్యూహంలో చిక్కి విలవిల్లాడాల్సిందే అని తె లంగాణ తల్లి ప్రతిష్ఠతో తేలిపోయింది. తెలంగాణ ఉద్యమం తనను తాను ఉన్నతీకరించుకోవడం కోసం సాంస్కృతిక ప్రతీకను సృష్టించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా ఆ విగ్రహాన్ని ముందుపెట్టారు. తెలంగాణతల్లి రూపంపై చర్చ కేవలం భావోద్వేగ ఉత్ప్రేరకంగానే ఉండకూడదని భౌతిక బంధంగా రూపాంతరం చెందాలని భావించారు. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహాన్ని భవన్లో ప్రతిష్ఠించారు. 2007 నవంబర్ 15వ తేదీన హైదరాబాద్ పురవీధులన్నీ తెలంగాణ సంస్కృతీ వైభవంతో ఓలలాడాయి.
తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా నిర్మాణం
తెలంగాణ భవన్‌ను కేసీఆర్ తెలంగాణ సంస్కృతికి నిలయంగా తీర్చిదిద్దారు. హైదరాబాద్ గంగా జమునా తహెజీబ్‌ను ప్రతిబించేలా ఇండో-పర్షియన్ నిర్మాణ శైలిని గుర్తుకు తెస్తూ హైదరాబాద్ సంస్కృతి ఉట్టిపడేలా రూపొందించారు. తెలంగాణ భవన్‌ను కేవలం పార్టీ కార్యాలయంగానే కాకుండా తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలు, కళలు, భౌగోళిక అస్తిత్వ పతాకగా మలిచారు. తెలంగాణ భవన్‌లోని వివిధ విభాగాలకు ప్రజాకవి కాళోజీ (మీటింగ్ హాల్), సురవరం ప్రతాపరెడ్డి (మీడియా హాల్) వంటి మహనీయుల పేర్లను పెట్టారు. తెలంగాణ భవన్‌లోకి అడుగుపెట్టగానే పల్లెపట్నం జమిలీగా సంస్కృతి స్వాగతం పలుకుతుంది. రాష్ట్రంలో పారే కృష్ణా, గోదావరి నదులు, వాటి ఉపనదులు, వాగులు, కాకతీయ కళాతోరణం, రామప్ప శిల్పసౌరభం, చార్మినార్, గోల్కొండ వైభవం, బతుకమ్మ, బోనాలు, తెలంగాణ వంటకాలు, తెలంగాణకే ప్రత్యేకమైన ఆటలు, మహనీయుల చిత్రపటాలు దర్శనమిస్తాయి. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరణం అనంతరం ఆయన విగ్రహాన్ని భవన్లో ఏర్పాటుచేశారు. మీటింగ్ హాల్‌కు ఇరువైపులా తెలంగాణ వారసత్వ సంపద చిత్రాలు ముచ్చట గొలిపితే.. మరోవైపు ఉద్యమ రూపాలైన వంటావార్పు, రైల్‌రోకో, సడక్‌బంద్, సకల జనుల సమ్మె, ప్రపంచమే నివ్వెరపోయే తెలంగాణ సింహగర్జన, తెలంగాణ మహాగర్జన వంటి దృశ్యాల మాలిక ఈ తరానికి తెలిపే సాక్షీభూతంగా ఉన్నాయి.

‘యువ’ తరంగాల వేదిక
తెలంగాణ కోసం పల్లె.. పట్టణాలను ఏకంచేసి అన్నివర్గాలకు బీఆర్ఎస్ చైతన్యాన్ని నూరిపోసింది. ఉడుకు నెత్తురు ఉరకలువేసే విద్యార్థిలోకాన్ని కేసీఆర్ తెలంగాణ పోరాటంలోకి వ్యూహాత్మక ముందుచూపుతో దించారు. తెలంగాణ భవన్ వేదికగా 50 రోజులపాటు తెలంగాణలోని 94 అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 21వేల మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు (ఆగస్టు 11వ తేదీ 2007 నుంచి అక్టోబర్ 9, 2007 వరకు) నిర్వహించింది. ఆ తర్వాత అన్ని ప్రధాన పట్టణాల్లో విద్యార్థి సదస్సులు నిర్వహించారు. తెలంగాణ వివిధ రంగాలకు జరుగుతున్న అన్యాయాలను, అణచివేత, విధ్వంసాలను స్వయంగా కేసీఆరే వివరించేవారు. 2008 డిసెంబర్ 29న ‘విద్యార్థి గర్జన’ పేరుతో భారీ బహిరంగసభ నిర్వహించారు. 1969 ఉద్యమ చేదు అనుభవాల నేపథ్యంలో విద్యార్థిలోకాన్ని మమేకం చేసేందుకు ఆ శిక్షణ దోహదం పడింది. మరోవైపు బీఆర్ఎస్లోని యువనాయకత్వం భవన్లో శిక్షణ పొందిన వారే కావడం విశేషం.
ఉద్యమకారుల జమ్మిచెట్టు
ఉద్యమకారులకు తెలంగాణ భవన్ అడ్డాగా మారింది. నాడు ఉమ్మడి 10 జిల్లాల్లో విద్యార్థి, యువకులతోపాటు ఉస్మానియా, కాకతీయ వంటి విశ్వవిద్యాలయాల్లో వీరోచితంగా పోరాడే విద్యార్థి నేతలే టార్గెట్ అయ్యేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు, మంత్రులు, సహా ఇతర ప్రముఖ నాయకుల పర్యటనల సందర్భంగా చోటుచేసుకున్న ఉద్రిక్తతలకు ఉద్యమకారులనే పోలీసులు లక్ష్యంగా చేసుకొని అరెస్టులు చేసి, జైళ్లకు పంపేది. ప్రత్యేకించి కొందరిని టార్గెట్ చేసి వారిని, వారి కుటుంబసభ్యులను బెదిరించేది. అటువంటి వేలాది మందికి తెలంగాణ భవన్ గూడు. అనేక మంది ఉద్యమకారులకు ప్రాణరక్షణ కేంద్రంగా నిలిచింది. తెలంగాణ నలుమూలల నుంచి హైదరాబాద్‌కు వచ్చే వారికి విడిది కేంద్రంగా, విజ్ఞాన భాండాగారంగానూ విలసిల్లింది.
మాతో గోక్కున్న వారెవరూ ముందల పడలేదు
‘మాది న్యాయమైన, ధర్మమైన పోరాటం. ప్రాణాలైనా అర్పించి తెలంగాణను సాధిస్తాం. మాతో గోక్కున్నవారు ముందుపడలేరు. టీఆర్ఎస్తో, తెలంగాణతో కాంగ్రెస్ గోక్కుంటే తలకొరివి పెట్టుకున్నట్టే. భవనం పూర్తయింది. భువనం రావాల్సి ఉన్నది. కేసీఆర్ బక్కవాడు. టీఆర్ఎస్ బలహీనమైందని చేతులు దులుపుకోవాలనుకుంటే తెలంగాణ బెబ్బులై లేస్తుంది. తెలంగాణ ఇస్తామన్న హామీని నిలబెట్టుకొని కాంగ్రెస్ హీరో అవుతుందో? లేక విలన్‌గా మారుతుందో? తేల్చుకోవాలి’
-కేసీఆర్ (తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా)
అద్భుత భవనం కట్టారు.. తెలంగాణనూ కేసీఆర్ చేతిలో పెడితే.
‘తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో? చంద్రశేఖర్‌రావు మాకు చెప్తుంటే ఆయనలోని నిజాయితీ కనిపించింది. కానీ, ఇప్పుడు ఇది చూస్తుంటే ఆయనలో ఉన్నది కేవలం నిజాయితీ మాత్రమే కాదు. తెలంగాణ పట్ల గొప్ప విజన్ ఉన్నదని అర్థమైంది. ‘ఒక్క ఎకరం జాగలో ఇంత అద్భుతమైన నిర్మాణం చేశారు. ఇదే చంద్రశేఖర్‌రావు చేతిలో తెలంగాణనూ పెడితే దేశం మొత్తం గర్వపడేలా రాష్ర్టాన్ని తీర్చిదిద్దుతారు. అందులో సందేహమే లేదు’
– తెలంగాణ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాందాస్