Stock Market : భారతీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 242 పాయింట్లు నష్టపోగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 64 పాయింట్ల నష్టాన్ని చవిచూసింది. సెన్సెక్స్ ఉదయం 72,633.68 పాయింట్ల వద్ద నష్టాల్లోనే మొదలైంది. ఒక దశలో 700 పాయింట్ల కనిష్ట నష్టాన్ని తాకింది. చివరకు కొంచెం కోలుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి 242.65 పాయింట్ల నష్టంతో 72,529.07 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 64.05 పాయింట్లు నష్టపోయి, 22,716.20 వద్ద ముగిసింది.
సెనెక్స్ 30 సూచీలో అదానీ పోర్ట్స్, ఎన్టీపీసీ, సన్‌ఫార్మా, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో నడిచాయి. అదానీ పోర్ట్స్ ఏకంగా 4.39 శాతం లాభపడింది. మరోవైపు హిందుస్తాన్ యునీలీవర్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, టైటాన్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. టైటాన్ అత్యధికంగా 2.72 శాతం నష్టపోయింది. 30 ఇండెక్స్‌లో 12 షేర్లు లాభపడగా, 18 కంపెనీల షేర్లు నష్టాల్లో సాగాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 50లో 17 షేర్లు లాభపడగా, 32 నష్టాల్లో ముగిశాయి.
ఒకటి లాభనష్టాలు లేకుండా ఉంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ ఫ్లాట్‌గా ముగిసింది. 0.10 శాతం లాభపడిన రూపాయి డాలర్‌తో 95.97 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ఔన్స్ ధర 4419 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బ్రెంట్ క్రూడాయిల్ ధర భారీగా పెరిగింది. బ్యారెల్ క్రూడాయిల్ ధర 104 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఇరాన్-అమెరికా యుద్ధం ఇంకా కొనసాగే పరిస్థితులు చమురు ధరలు పెరిగేందుకు కారణాలు.