Asian Games : పద్దెనిమిదో ఆసియా క్రీడల్లో భారత బాక్సర్లు దూకుడు కనబరుస్తున్నారు. సూపర్ పంచ్‌తో ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ పసిడి వేటకు సిద్ధమయ్యారు. సెమీఫైనల్లో అదిరే విజయంతో ప్రవీణ్ హుడా(65 కిలోలు), అంకుశ్ పంఘల్(80 కిలోలు)లు ఫైనల్‌కు దూసుకెళ్లారు. తద్వారా కనీసం రజతం ఖాయం చేశారిద్దరు. పురుషుల 90 ప్లస్ క్వార్టర్స్‌లో విఫలమైన నరేందర్ బెర్వాల్ కాంస్యంతో సరిపెట్టుకున్నాడు.
ఐచీ నగోయలో భారత బాక్సర్లు పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. సెమీఫైనల్ చేరి కనీసం కాంస్యం చేసిన ఆరుగురిలో ఇద్దరు ఫైనల్లో అడుగుపెట్టారు. మహిళల విభాగంలో ప్రవీణ్ హుడా(65 కిలోలు), పురుషుల విభాగంలో అంకుశ్ పంఘల్(80 కిలోలు)లు పసిడిపై కన్నేశారు. మంగళవారం ఏకపక్ష పోరులో చైనా బాక్సర్ లీ షుపై 5-0తో గెలుపొందిన హుడా.. చరిత్రాత్మక పతకంపై గురి పెట్టింది.
Parveen punches her ticket to the Women’s 65kg Final after a stellar victory over China’s Li Shu! 🥊✨
Watch the 20th Asian Games Aichi-Nagoya 2026 LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames #AichiNagoya2026… pic.twitter.com/yn5kKxsjxN
— Sony Sports Network (@SonySportsNetwk) September 29, 2026
THE CHAMPION FALLS. ANKUSH RISES. 🥊🔥🇮🇳
SUBEDAR ANKUSH PANGHAL IS IN THE ASIAN GAMES FINAL!
A stunning 4–1 split-decision victory over Uzbekistan’s reigning 75kg World Champion Fazliddin Erkinboev sends Haryana’s Ankush Panghal into the Men’s 80kg gold-medal bout.
This wasn’t… pic.twitter.com/MswUHxHtpw
— Anil Bansal (@dilseanilbansal) September 29, 2026
క్వార్టర్స్‌లో దుమ్మురేపిన అంకుశ్ సెమీస్‌లోనూ పంజా విసిరాడు. అతడి ధాటికి వరల్డ్ ఛాంపియన్ ఫజ్లిద్దిన్ ఎర్కిన్బొయెవ్(ఉబ్జెకిస్థాన్) చేతులెత్తేశాడు. దాంతో ఎనిమిదేళ్ల తర్వాత ఆసియాడ్‌లో ఫైనల్ చేరిన భారత పురుష బాక్సర్‌గా అంకుశ్ రికార్డు నెలకొల్పాడు. మరో బౌట్లో.. నరేందర్ బెర్వాల్ కంగుతిన్నాడు. పురుషుల 90 ప్లస్ విభాగంలో ఆశలు రేపిన అతడు వరల్డ్ ఛాంపియన్ ఐబెక్ ఒరల్బే చేతిలో ఊహించని ఓటమితో కాంస్యం అందుకున్నాడు.
#News | Narender Berwal wins bronze in men’s boxing +90kg category at the Asian Games 🥉🎉🇮🇳
He lost to reigning world champion Aibek Oralbay of Kazakhstan by a unanimous 0-5 decision in the semi-final.
This will be his second consecutive Asian Games medal, following a bronze… pic.twitter.com/WvfOnkdQmI
— The Bridge (@the_bridge_in) September 29, 2026