యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 29 : శ్రీ లక్ష్మీనరసింహాస్వామి వారి దేవాలయ అభివృద్ధికి యాదగిరిగుట్ట దేవస్థానం (వై.టి.డి) దాతలకు ఆహ్వానం పలుకుతుంది. భక్తుల సౌకర్యార్థం కొండపైన దీక్షాపరుల మండపం నిర్మాణం, స్వామి వారి నిత్య కల్యాణ మండపం నిర్మాణం, వేద పాఠశాల నిర్మాణం, మోడల్ గోశాల నిర్మాణం, కుకింగ్ అండ్ క్లీనింగ్ మిషనరీలు, 4 మెగా వాట్ల సోలార్ గ్రిడ్ ఏర్పాటు, ఐదు కూడళ్లలో విగ్రహాల ఏర్పాటు, లైటింగ్, సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు వంటి తదితర పనులకు వైటీడీ దాతల నుండి రూ.178 కోట్లను విరాళాలుగా ఆహ్వానిస్తుంది. ఈ మేరకు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయ అభివృద్ధి పనులకు దాతలు కావాలని ఆలయ సిబ్బంది కరపత్రాలు పంచుతుంది. కాగా ఆలయ అభివృద్ధికి వైటీడీ ట్రస్టు బోర్డు సభ్యులు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదా? ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదా? అంటూ భక్తులు ప్రశ్నిస్తున్నారు. మిస్ వరల్డ్ పోటీలకు దేవస్థానం నిధులు వాడుకుని, ఇప్పుడు అభివృద్ధికి నిధులు అర్థించడం ఏంటని స్థానిక నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘యాదాద్రి ఆలయ అభివృద్ధికి దాతలు కావలెను’