Flash floods | ఉత్తరాఖండ్‌లో మళ్లీ క్లౌడ్ బరస్ట్.. వరదల్లో పలువురు గల్లంతు
Flash floods | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloud burst) సంభవించింది. రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్త్రధారలో వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు.
Flash floods : ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Cloud burst) సంభవించింది. రాజధాని డెహ్రాడూన్ (Dehradun) లో మెరుపు వరదలు బీభత్సం సృష్టించాయి. సహస్త్రధారలో వరద ధాటికి పలువురు గల్లంతయ్యారు. వరదతోపాటు వచ్చిన బురద, ఇతర శిథిలాల తాకిడికి అనేక ఇళ్లు, దుకాణాలు, హోటళ్లు దెబ్బతిన్నాయి.
రహదారులపైకి భారీగా వరద చేరడంతో వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. రిషికేశ్‌లో చంద్రభాగనది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అందులో పడి ఐదుగురు కొట్టుకుపోయారు. నది వరదలో చిక్కుకున్న మరో ముగ్గురిని నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బంది రక్షించారు.
అదేవిధంగా తమ్సా, టన్స్, సాంగ్ నదులు కూడా ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. పునరావాస కేంద్రాల్లో వారికి ఆశ్రయం కల్పించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

