Loot Liquor | బీహార్ (Bihar) రాష్ట్రం సివాన్ (Siwan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మద్యం సీసాలతో నిండిన ఓ స్కార్పియో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన గుంటలో ఇరుక్కుపోయింది. విషయం తెలుసుకున్న స్థానికులు వాహనంలోని మద్యం బాటిల్స్‌ను లూటీ చేశారు (Locals loot liquor). ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
మద్యం బాటిళ్లతో నిండిన స్కార్పియో వాహనం మైర్వా ప్రధాన రహదారిలోని జంసిక్రీ గ్రామం సమీపంలో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంటలోకి దూసుకెళ్లింది. అది బురద నీటిలో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన స్థానికులు సాయం చేయకపోగా.. అందులోని మద్యం బాటిల్స్ కోసం ఎగబడ్డారు. వాహనం అద్దాలు పగలగొట్టి మద్యం సీసాలను దోచుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. త్వరలో రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న వేళ వాహనం ఎవరిది, మద్యం బాటిల్స్‌ను ఎక్కడికి తరలిస్తున్నారు వంటి వాటిపై దర్యాప్తు చేస్తున్నారు.
Breaking, Bihar Prohibition Policy News: बिहार में शराबबंदी कानून की उड़ी धज्जियां, Siwan में स्कॉर्पियो से शराब की लूट, वीडियो वायरल
पढ़ें पूरी खबर:https://t.co/uDhh4eycBK#Bihar #biharNews #siwan pic.twitter.com/vlaYatErgZ
— Rashtra Bharat (@RBharatdigital) September 15, 2025
Also Read..
Masood Azhar: ఆపరేషన్ సింధూర్ దాడితో మసూద్ అజార్ కుటుంబం ముక్కలైంది : జైషే కమాండర్ వీడియో
Tapkeshwar Mahadev Temple: తపకేశ్వర్ మహాదేవ్ ఆలయంలోకి నీళ్లు.. 12 ఫీట్ల ఎత్తుకు వరద నీరు