Himachal Pradesh | హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని సిమ్లా, మండి సహా పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం (Heavy rain ) కురిసింది. ఈ వర్షానికి వరదలు సంభవించాయి. రాజధాని సిమ్లా, సమీప ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడ్డాయి. మండి జిల్లాలోని ఓ బస్ డిపోను వరద ముంచెత్తింది. ఈ వర్షాలకు ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగాయి. అనేక ఇళ్లు నేలకూలాయి. జనజీవనం స్తంభించిపోయింది.
మండిలో సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది. తెల్లవారుజామున 1 గంట సమయానికి వర్షం తీవ్రత పెరిగింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చి సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నారు. సౌలి ఖాద్ నది పొంగిపొర్లుతోంది. ధరంపూర్ సబ్ డివిజన్లోని బస్ డిపో పూర్తిగా నీట మునిగింది. దీంతో అనేక బస్సులు నీట మునిగాయి. బస్టాండ్ సమీపంలో ఉన్న కార్లు, ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. అనేక ఇళ్లు నీట మునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ ఎలాంటి మరణాలూ సంభవించలేదని అధికారులు తెలిపారు.
Also Read..
Kashmir Apples: స్తంభించిన హైవే.. మురిగిపోతున్న యాపిల్స్.. 700 కోట్ల నష్టం
Assam | పోలీసులకు చిక్కిన అవినీతి తిమింగలం.. ఏసీఎస్ అధికారిణి ఇంట్లో భారీగా నగదు, బంగారం స్వాధీనం
Clouburst | ఉత్తరాఖండ్లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన ఇళ్లు, కొట్టుకుపోయిన వంతెనలు