Clouburst | ఉత్తరాఖండ్ (Uttarakhand) రాష్ట్రంలో మరోసారి క్లౌడ్ బరస్ట్ (Clouburst) సంభవించింది. డెహ్రాడూన్ (Dehradun)లో సోమవారం రాత్రి సంభవించిన మేఘ విస్ఫోటనం కారణంగా వరదలు సంభవించాయి. తపోవన్‌లో అనేక ఇళ్లు నీట మునిగాయి. సహస్త్రధార, ఐటీ పార్క్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ వరదలకు ఇప్పటి వరకూ ఇద్దరు వ్యక్తులు గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.
#WATCH | Uttarakhand: River Sahastradhara flooded due to heavy rains in Dehradun since last night. Debris came into the main market, causing damage to hotels and shops. pic.twitter.com/f4WoAOWleP
— ANI (@ANI) September 16, 2025
రాత్రి నుంచి నిరంతరం కురుస్తున్న భారీ వర్షానికి (Heavy Rain) కార్లిగాడ్ వాగులో వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. అప్రమత్తమైన అధికారులు ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ వరద ఉద్ధృతికి పలు వంతెనలు కూలిపోయాయి. తాజా పరిస్థితిపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి (Pushkar Singh Dhami) ఎక్స్‌లో స్పందించారు. డెహ్రాడూన్‌లోని సహస్త్రధారలో భారీ వర్షం కారణంగా ఇళ్లు, దుకాణాలు దెబ్బతిన్నట్లు చెప్పారు. ప్రస్తుతం అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు చేపడుతున్నట్లు తెలిపారు.
#WATCH | Uttarakhand: Due to heavy rains in Dehradun since last night, the river Sahastradhara got flooded late at night, and debris came into the main market, causing damage to hotels and shops. pic.twitter.com/f7p0tSg7Ip
— ANI (@ANI) September 16, 2025
కాగా, రుతుపవనాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. రెండు నెలలుగా వరదలు విధ్వంసం సృష్టించాయి. భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో ఈనెల 11న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరద పరిస్థితిని అంచనా వేసేందుకు డెహ్రాడూన్‌ను సందర్శించారు. విపత్తుపై ఉన్నత స్థాయి అధికారులతో చర్చించారు. ఈ మేరకు రూ.1,200 కోట్ల ఆర్థిక సాయం ప్రకటించారు.
#WATCH | Uttarakhand: Due to the heavy rainfall since last night, the bridge near Fun Valley and Uttarakhand Dental College on the Dehradun–Haridwar National Highway has been damaged.
(Source: Police) pic.twitter.com/4dHTscMg7G
— ANI (@ANI) September 16, 2025
Also Read..
Indore Accident | మద్యం మత్తులో డ్రైర్.. జనంపైకి లారీ
ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు.. జిన్‌పింగ్ అలా.. మోదీ ఇలా..
ఇండియన్స్‌కు ‘నో’ ఎంట్రీ.. అమెరికా ఆపింది.. ఆస్ట్రేలియా పొమ్మంది