ట్రంప్ టారిఫ్ హెచ్చరికలు.. జిన్‌పింగ్ అలా.. మోదీ ఇలా..
రష్యా నుంచి చమురు కొనుగోలును బూచిగా చూపుతూ భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల వాత పెడుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ రెండు దేశాలపై టారిఫ్‌లు విధించాలని నాటో, జీ7 దేశాలను ఉసిగొల్పుతున్నారు. ట్రంప్ చర్యలను తప్పుబడుతూ ప్రధాని మోదీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు.
- ట్రంప్ టారిఫ్ హెచ్చరికలకు దీటైన జవాబిచ్చిన చైనా
- సుంకాలకు ప్రతిచర్య ఉంటుందని నాటో, జీ7కు హెచ్చరిక
- భారత్‌పై సుంకాలతో పాటు నోరు పారేసుకొన్న ట్రంప్
- డెడ్ ఎకానమీ అని, పాక్ దగ్గర చమురు కొనాలని హేళన
- నాటో, జీ7 దేశాలను ఉసిగొల్పుతూ టారిఫ్‌లకు యత్నం
- అయినప్పటికీ, ఇంతవరకూ నోరు తెరవని ప్రధాని మోదీ
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : రష్యా నుంచి చమురు కొనుగోలును బూచిగా చూపుతూ భారత్, చైనాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల వాత పెడుతున్నారు. అంతటితో ఆగకుండా ఈ రెండు దేశాలపై టారిఫ్‌లు విధించాలని నాటో, జీ7 దేశాలను ఉసిగొల్పుతున్నారు. ట్రంప్ చర్యలను తప్పుబడుతూ ప్రధాని మోదీ ఒక్క ప్రకటన కూడా చేయలేదు. అయితే, చైనా మాత్రం తీవ్రంగా స్పందించింది. తమను ఏకపక్షంగా వేధించేందుకు ఆర్థిక బలప్రదర్శన కోసమే అమెరికా ఇటువంటి చర్యలు చేపడుతున్నదని మండిపడింది. అమెరికా చెప్పినట్టు చేస్తే, తాము కూడా ప్రతిచర్యలు చేపడుతామని నాటో, జీ7 దేశాలను హెచ్చరించింది. భారత్‌పై టారిఫ్‌లు విధించాలని నాటో, జీ7 దేశాలపై ఇటీవల ట్రంప్ ఒత్తిళ్లు తీసుకొచ్చారు. అయితే, ట్రంప్ చర్యలను ఖండిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్క ప్రకటన కూడా చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్‌పై ముప్పేట దాడి
సుంకాల పేరిట అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొంటున్న ఏక పక్ష నిర్ణయాలను తప్పుబడుతూ పలు దేశాలు ఎప్పటికప్పుడు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి. బ్రిక్స్ అనుకూల దేశాలపై 10 శాతం అదనపు సుంకాలు విధిస్తామన్న ట్రంప్ ప్రకటనపై బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డిసిల్వా తీవ్రంగా స్పందించారు. తమ ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా పోల్చడంపై రష్యా కూడా ట్రంప్‌పై గట్టిగానే మండిపడింది. ఇప్పుడు నాటో, జీ7 దేశాలను తమపై ఉసిగొల్పిన ట్రంప్‌ను చైనా గట్టి హెచ్చరికలతో కట్టడి చేసింది.
నోరు మెదపని మౌన ప్రధాని
ట్రంప్‌కు మిగతా దేశాలు గట్టిగా బదులిస్తుంటే, ప్రధాని మోదీ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలపై, ఆయన విధించిన సుంకాలపై ఏ విధంగానూ స్పందించకపోవడం విమర్శలకు తావిస్తున్నది. రష్యా-భారత్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్ గత నెలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రష్యాతో భారత్ ఎలాంటి వాణిజ్య ఒప్పందం చేసుకొన్నా తనకు సంబంధం లేదన్న ట్రంప్.. ఈ క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా అభివర్ణించారు. ఇక, పాకిస్థాన్‌తో కుదిరిన వాణిజ్య ఒప్పందం గురించి చెప్తూ.. భారత్‌పై నోరు జారారు. భవిష్యత్తులో భారత్‌కు పాక్ చమురు విక్రయించవచ్చంటూ ఊహాగానాలు చేశారు. ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ, మోదీ ఖండించకపోవడంపై పలువురు మండిపడుతున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- America
- china
- India
- oil purchases
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

