ఇండోర్: మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ లారీ బీభత్సం (Indore Accident) సృష్టించింది. పూటుగా మద్యం తాగిన డ్రైవర్ (Drunk Driver) లారీని వాహనాలు, జనాల మీదికి తీసుకెళ్లాడు. దీంతో మనుషులు గాల్లోకి ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మరణించగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ లారీని నడుపుతూ తొలుత ఇండోర్ పట్టణంలోని రామచంద్ర నగర్ ఇంటర్సెక్షన్ ప్రాంతంలోకి ప్రవేశించాడు. అక్కడ పలు బైకులను ఢీకొట్టాడు. వాటిని అలాగే లాక్కుట్టూ బడాగణపతి ఏరియాలోకి చేరుకున్నాడు. వాహనంపై అదుపు లేకపోవడంతో పాదచారులను, వాహనాలను గుద్దుతూ ముందుకెళ్లాడు. దీంతో మనుషులు అంతెత్తు ఎగిరి పడ్డారు. తీవ్రంగా గాయపడిన ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. వారిని స్థానికులు హుటాహుటిన దవాఖానకు తరలించారు.
Uncontrolled speeding truck runs over people in Indore’s Airport Road area’s Shikshak Nagar locality. At least 2 deaths confirmed. Death toll likely to rise, as many critically injured persons rushed to the hospital. @NewIndianXpress @santwana99 @jayanthjacob pic.twitter.com/GdysfCCRIY
— Anuraag Singh (@anuraag_niebpl) September 15, 2025
లారీ క్యాబిన్ కింద ఓ బైక్ చిక్కుకోవడంతో.. పెట్రోల్ ట్యాంక్ పగిలి మంటలు చెలరేగాయి. దీంతో లారీ దగ్ధమయిందని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. అయితే లారీని ప్రజలే తగులబెట్టినట్లు తెలుస్తున్నది. ఈ ప్రమాదంతో ఆ ప్రాంతంలో బీతావహ వాతావరణం ఏర్పడింది. మృతుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. మృతదేహాలు ఛిద్రమయ్యాయి.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లారీ డ్రైవర్ తమ అదుపులోనే ఉన్నారని తెలిపారు. ప్రమాదంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని సీఎం మోహన్ యాదవ్ అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.
इंदौर में भयावह सड़क हादसा:
इन्दौर की दुर्घटना का विडियो फुटेज#Indore #Accident #MP #MadhyaPradesh #IndoreAccident #indoreaccident #Truck pic.twitter.com/Jrd2qcGk3f— Ankit (@AnkitNamd) September 15, 2025