Assam | అస్సాం (Assam) రాష్ట్రంలో ఓ అవినీతి తిమింగలం అధికారులకు చిక్కింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో అస్సాం సివిల్ సర్వీస్ (ACS) అధికారిణిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నివాసం నుంచి భారీగా నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి ప్రత్యేక విజిలెన్స్ సెల్ అధికారుల (Assam Civil Service Officer) బృందంలో పనిచేస్తన్న నూపుర్ బోరా (Nupur Bora)పై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఆమెపై భూ కుంభకోణం, ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దీంతో అధికారులు ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.92 లక్షల నగదు, రూ.కోటి విలువైన బంగారు ఆభరణాలు (Jewellery) స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఆమెను అరెస్ట్ చేశారు. 2019లో అస్సాం సివిల్ సర్వీసెస్‌లో చేరిన నూపుర్ బోరా.. ప్రస్తుతం కామ్రూప్ జిల్లాలోని గోరోయిమారిలో సర్కిల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.
Also Read..
TikTok | అమెరికాలో టిక్‌టాక్ సేవలు.. చైనాతో కీలక డీల్ కుదిరిందంటూ ట్రంప్ ప్రకటన
Clouburst | ఉత్తరాఖండ్‌లో మరోసారి క్లౌడ్ బరస్ట్.. నీట మునిగిన ఇళ్లు, కొట్టుకుపోయిన వంతెనలు
Indore Accident | మద్యం మత్తులో డ్రైర్.. జనంపైకి లారీ