TikTok | అమెరికాలో టిక్‌టాక్ సేవలు.. చైనాతో కీలక డీల్ కుదిరిందంటూ ట్రంప్ ప్రకటన
TikTok | చైనా (China) కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ (Tik Tok) అమెరికా (America)లో అందుబాటులోకి రానుంది. టిక్‌టాక్ విషయంలో చైనాతో అమెరికాకు కీలక ఒప్పందం కుదిరింది.
TikTok | చైనా (China) కంపెనీకి చెందిన ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ (Tik Tok) అమెరికా (America)లో అందుబాటులోకి రానుంది. టిక్‌టాక్ విషయంలో చైనాతో అమెరికాకు కీలక ఒప్పందం కుదిరింది. టిక్‌టాక్ యాజమాన్య హక్కులపై అమెరికా-చైనా మధ్య ముసాయిదా ఒప్పందం కుదిరినట్లు యూఎస్ ఆర్థిక మంత్రి స్కాట్ బీసెంట్ ప్రకటించారు.
స్పెయిన్ వేదికగా ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తుది ఒప్పందం ఖరారుకు అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping) సంభాషించనున్నట్లు తెలిపారు. మరోవైపు టిక్ టాక్ పునరుద్ధరణపై చైనా అధికారులతో అమెరికా అధికారులు జరిపిన చర్చలు సఫలం అయ్యాయని ట్రూత్ సోషల్ వేదికలో ట్రంప్ (Donald Trump ) వెల్లడించారు. త్వరలో తమ దేశంలో టిక్ టాక్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. టిక్ టాక్ మళ్ళీ వస్తే అమెరికా యువత చాలా సంతోషిస్తుందని అధ్యక్షుడు కామెంట్ చేశారు.
కాగా, బైడెన్ ప్రభుత్వ హయాంలో టిక్‌టాక్‌పై అమెరికా నిషేధం విధించిన విషయం తెలిసిందే. టిక్‌టాక్ (Tik Tok) నిషేధానికి సంబంధించిన ఓ బిల్లును కూడా సెనేట్‌లో ప్రవేశపెట్టారు. ఆ బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం కూడా తెలిపింది. ఇక జనబాహుల్యంలో విశేష ఆదరణ పొందిన ఈ షార్ట్ వీడియో యాప్‌ను నిషేధించేందుకు తీసుకొచ్చిన చట్టం అమల్లోకి రావడంతో సేవలను సంస్థ ఒకరోజు ముందే నిలిపివేసింది. అయితే, ట్రంప్ అధికారంలోకి వచ్చాకా.. టిక్‌టాక్ కంపెనీలో కనీసం 50 శాతం వాటా అమెరికా పెట్టుబడిదారుల చేతిలో ఉండేలా షరతులు విధిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా వాటి సేవలను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. తాము తమ వ్యాపారాన్ని చైనాకు గానీ, ఇతరులకు గానీ అప్పగించాలని అనుకోవడం లేదన్నారు. ఇలా చేయడం ద్వారా తమ దేశ పౌరుల డేటా చైనాకు చేరుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై టిక్‌టాక్ సానుకూలంగా స్పందించింది. అమెరికాలో తమ సేవలు పునరుద్ధరించే ప్రక్రియను మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఇరు దేశాల మధ్య ముసాయిదా ఒప్పందం కుదరడం విశేషం.
Also Read..
మా మక్కజొన్న కొనాల్సిందే.. భారత్‌కు ట్రంప్ సర్కార్ బెదిరింపు
ట్రంప్ యూ టర్న్.. దక్షిణ కొరియా దెబ్బకు దిగొచ్చిన అమెరికా
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

