న్యూయార్క్: డ్రగ్స్‌ను స్మగ్లింగ్ చేస్తున్న బోటును అమెరికా పేల్చివేసింది. వెనిజులా దేశానికి ఆ బోటు చెంది ఉంటుందని భావిస్తున్నారు. మాదకద్రవ్యాలతో అమెరికా దిశగా అంతర్జాతీయ జలాల్లో ప్రయాణిస్తున్న బోటోను అమెరికా మిలిటరీ పేల్చివేసింది. దానికి సంబంధించిన వీడియోను దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) షేర్ చేశారు. ఆ అటాక్‌లో ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు ట్రంప్ వెల్లడించారు. అయితే బోటులో ఏ మేర మాదకద్రవ్యాలు ఉన్నాయన్న అంశాన్ని ఆయన స్పష్టంగా తెలుపలేదు.
ఇటీవల అమెరికా, వెనిజులా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దక్షిణ కరీబియన్ సముద్రంలో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించింది. నార్కోటిక్స్ కౌంటర్ ఆపరేషన్‌లో భాగంగా యుద్ధ నౌకలను మోహరించినట్లు అమెరికా చెబుతోంది. అయితే తాజాగా తన ఆదేశాల ప్రకారం అమెరికా మిలిటరీ దళాలు.. విధ్వంసకరమైన డ్రగ్ ట్రాఫికింగ్ కార్టెల్‌కు చెందిన బోటును పేల్చివేశారని ట్రంప్ తన ట్రుత్ సోషల్‌లో పేర్కొన్నారు. అమెరికా జాతీయ భద్రతకు ఆ డ్రగ్ కార్టల్స్ తీవ్ర విఘాతం కలిగిస్తున్నట్లు చెప్పారు.
బోటు పేల్చివేతకు చెందిన 30 సెకన్ల వీడియోను షేర్ చేశారు. సముద్ర నీటిలో వెళ్తున్న బోటు ఒక్కసారిగా పేలుతుంది, ఆ తర్వాత భారీ స్థాయిలో మంటలు వ్యాపిస్తాయి. ఆ బోటు నార్కో-టెర్రిరిస్టు గ్రూపులకు చెందినట్లు తమ వద్ద ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నట్లు ట్రంప్ వెల్లడించారు. బోటు పేలడంతో.. దాంట్లో ఉన్న కొకైన్, ఫెంటనిల్.. చెల్లాచెదురుగా పడిపోయిందన్నారు. చాలా జాగ్రత్తగా ఆ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు.
President Trump announced that US forces launched a second kinetic strike on Venezuelan narco-terrorists smuggling drugs through international waters, killing three traffickers.
“BE WARNED — IF YOU ARE TRANSPORTING DRUGS THAT CAN KILL AMERICANS, WE ARE HUNTING YOU!”
Follow:… pic.twitter.com/jJGj2orSCR
— AF Post (@AFpost) September 15, 2025