వాషింగ్టన్, సెప్టెంబర్ 15: అధికారంలోకి వచ్చింది మొదలు టారిఫ్‌లు, వలస విధానాలతో ఆయా దేశాలపై విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు దక్షిణ కొరియా గట్టి షాక్ ఇచ్చింది. దీంతో విదేశీ సంస్థల ఉద్యోగులకు స్వాగతమంటూ ట్రంప్ ఓ ప్రకటన చేయాల్సి వచ్చింది. అమెరికా పరిశ్రమలకు విదేశీ ఉద్యోగుల అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. దీనికంటే ముందు, తమ దేశ వ్యాపార సంస్థలు యూఎస్‌లో పెట్టుబడులు పెట్టడానికి వెనుకాడుతాయని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జూ మ్యూంగ్ హెచ్చరించారు. దీంతో ట్రంప్ దిగిరాక తప్పలేదు.
మరోవైపు ఖతార్ తమకు చాలా ముఖ్యమైన మిత్ర దేశమని, దానిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అనుకున్నప్పుడు ఇజ్రాయెల్ ఆచితూచి వ్యవహరించాలని ఆ దేశ ప్రధాని నెతన్యాహును ట్రంప్ హెచ్చరించారు. హమాస్‌పై ఎటువంటి చర్యలు తీసుకున్నా.. ఖతార్ జోలికి రావొద్దని అన్నారు.
ఇటీవల డాలస్‌లో భారత సం తతి మేనేజర్ నాగమల్లయ్య హత్యపై ట్రంప్ సోమవారం స్పం దించారు. ‘ఇలాంటి అక్రమ వలస నేరగాళ్ల పట్ల మృదువుగా వ్యవహరించడం అయిపోయింది’ అని చెప్పారు.