Rare fish : పసిఫిక్ సముద్రం (pacific ocean) అడుగు భాగంలో మూడు సరికొత్త క్యూట్ చేపల (Cute fishes) ను బయాలజిస్టులు కనుగొన్నారు. సముద్రంలో వేల అడుగుల లోతున ఇవి సంచరిస్తున్నట్లు గుర్తించారు. పింక్ రంగులో ఉండే బొడిపెలున్న స్నెయిల్ ఫిష్ (Snail fish) కెమెరాలకు చిక్కింది. సాధారణంగా నీటి అడుగు భాగంలో పదునైన దంతాలుండే మాన్స్టర్ లాంటి జీవులుంటాయని భావిస్తుంటారు. కానీ స్నెయిల్ ఫిష్ క్యూట్‌గా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.
గత నెల 27న ‘బయోవన్’ జర్నల్‌లో ప్రచురించిన పత్రంలో ఈ చేపల పేర్లను వారు వెల్లడించారు. రౌండ్‌గా తల ఉన్న పింక్ చేపకు కేర్ప్రొక్టస్ కొలికలి (Bumpy snail fish) అని, నల్లని రౌండ్ తల ఉన్న చేపకు కేర్ప్రొక్టస్ యాన్సెయి (Dark snail fish) అని, పొడవుగా ఉన్న చేపకు పారాలిపారిస్ ఎమ్ (Sleek snail fish) అని పేర్లు పెట్టారు. ఇందులో బంపీ స్నెయిల్ ఫిష్ సముద్ర ఉపరితలం నుంచి 10,722 అడుగుల లోతున ఉంటుంది. మిగిలిన రెండు చేపలు 13,513 అడుగుల లోతున ఉంటాయి.