Tirumala | తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక్ష్యంగా పడేసిందని పేర్కొన్నారు. మలమూత్రాలు, మద్యం బాటిళ్ల సమీపంలో నిర్లక్ష్యంగా శ్రీ మహావిష్ణువు విగ్రహాన్ని పడేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైందవ ధర్మాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ విగ్రహాన్ని చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని తెలిపారు. హిందూ దేవుళ్ల విగ్రహాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. అలిపిరి ఓల్డ్ చెక్ పాయింట్ కారు పార్కింగ్ వద్ద విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ టీటీడీ చైర్మన్, పాలకమండలి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించాలన్నారు. హిందుత్వ సంఘాలు, మఠాధిపతులు మేల్కోవాలన్నారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను రిలీజ్ చేశారు.
16.09.2025
తిరుపతి:-అలిపిరి పాదాల చెంత ఘోర అపచారం
-మలమూత్రాలు, మద్యం బాటిల్ మధ్య మహావిష్ణు విగ్రహం
-శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా టిటిడి పాలకమండలి తీరు
-హైందవ ధర్మానికి తూట్లు పొడుస్తున్న టిటిడి పాలకవర్గం, అధికారులు
-హిందూ సంఘాలన్నీ… pic.twitter.com/UMRYMzHUAc— YSR Congress Party (@YSRCParty) September 16, 2025