Wall Collapse : ఉత్తరాది రాష్ట్రాల (Northern states) లో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్నాయి. దాంతో వరదలు పోటెత్తి బీభత్సం సృష్టిస్తున్నాయి. జార్ఖండ్ (Jarkhand) లో ఎడతెగని వర్షాలవల్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాజధాని రాంచి (Ranchi) లో కూడా పలు ప్రాంతాల్లో వరదనీరు నిలిచింది. దాంతో ఓ గోడ బాగా నానిపోయి దారిపొంటి నడిచి వెళ్తున్న మహిళ పక్కనే కుప్పకూలింది. ఈ భయానక ఘటన నుంచి ఆమె తృటిలో తప్పించుకుంది.
గోడ కూలిన ఆ భయంకరమైన ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలో ఏముందంటే.. రోడ్డుపై నీరు నిలువడంతో ఓ మహిళ రోడ్డుకు ఒకవైపు గోడను అనుకుని నడుచుకుంటూ వెళ్తోంది. సరిగ్గా అప్పుడే అవతలివైపు ఉన్న గోడ నానిపోయి ఒక్కసారిగా కుప్పకూలింది. సదరు మహిళ మరో రెండుమూడు అంగుళాలు కుడివైపునకు నడిచివుంటే ప్రాణాలు పోయేవే. రెప్పపాటులో ఆమె మృత్యువు నుంచి తప్పించుకుంది. కింది వీడియోలో ఆ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఉన్నాయి.
झारखंड की राजधानी रांची में भारी बारिश के दौरान बड़ा हादसा टल गया। सड़क से गुजर रही महिला उस वक्त बाल-बाल बच गई जब अचानक पास की दीवार भरभराकर गिर पड़ी। पूरा वाकया CCTV में कैद हो गया और अब वीडियो सोशल मीडिया पर तेजी से वायरल हो रहा है#jharkhand #rachi #neardeath #wall #collide… pic.twitter.com/C67hIHSvUr
— News Bharat 24 (@nbh24official) September 16, 2025
జార్ఖండ్‌లోని పలు ప్రాంతాల్లో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో మరోసారి మేఘ విస్ఫోటనం సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోయారు. పలుచోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. రుద్రప్రయాగ్‌లోని పలు ఆలయాలు నీట మునిగాయి.